#రంగ్ దే.. కలర్ ఫుల్ రిలీజ్ టీజర్
యూత్ స్టార్ నితిన్ - కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం `రంగ్ దే`. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా రిలీజ్ తేదీని చిత్రబృందం ప్రకటించింది. రంగ్ దే విడుదల తేదీతో రంగురంగుల ప్రకటన యూత్ స్టార్ ఫ్యాన్స్ లోకి వైరల్ గా దూసుకెళ్లింది. నాయకానాయికల రొమాంటిక్ వీడియోతో విడుదల తేదీని ప్రకటించగా వైరల్ అవుతోంది. వేసవిలో మార్చి 26 న రంగ్ దే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
తాజా సాంగ్ ఆద్యంతం రంగురంగుల వీడియో ఆకట్టుకోగా.. విదేశీ లొకేషన్లలో బ్లూ వాటర్ లొకేషన్ లో ఎంతో శృంగారభరితమైన స్టెప్పులతో స్టార్లు ఆకర్షించారు. నితిన్ - కీర్తి జోడీ మ్యాజికల్ స్టెప్స్ మైమరిపించాయి. దేవి శ్రీ ప్రసాద్ తనదైన శైలిలో మెలోడీతో వీడియోకు రొమాంటిక్ ఫీల్ ని అద్దాడు. ఈ మూవీని సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. టాకీ చిత్రీకరణ ఇంతకుముందు ముగించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి.
Full View