తన పెళ్ళికి 'సీఎం'లను ఆహ్వానించనున్న స్టార్ హీరో..!!

Update: 2020-07-22 07:50 GMT
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసిన రానా.. ఆ వెంటనే రెండు కుటుంబాల సమక్షంలో రోకా వేడుక‌ను నిర్వ‌హించుకున్నారు. ఇక ఆగస్ట్‌ నెలలో పెళ్లి ఉంటుందని ప్రకటించారు. అయితే రోకా ఫంక్షన్ సందర్భంగా ఈ ఏడాదిలోపే రానా, మిహీక పెళ్లి చేస్తామని సురేశ్‌బాబు తెలిపాడు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోనే కొద్ది మంది బంధువులు, సన్నిహితలు సమక్షంలో రానా, మిహీకాల వివాహం జరపనున్నారు. ఈ సందర్భంగా రానా తండ్రి సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈ కరోనా కాలం ఇప్పట్లో ముగిసేలా లేదు.

అందుకే త్వరగా జరిపించేద్దాం అని పెళ్లి ముహూర్తం ఆగష్టు 8న ఫిక్స్ చేసాం. అంతేగాక ఈ పెళ్లిని తెలుగు.. మార్వాడి సంప్రదాయాలలో నిర్వహిస్తామని తెలిపాడు. అయితే ఈ పెళ్లిని ఎలాంటి భారీ హంగులు హంగామాలు లేకుండా నిర్ణయం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఈ రానా మిహీకల పెళ్ళికి  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని రానా, సురేష్ బాబు నిర్ణయించుకున్నారట. హైదరాబాద్ లోని ఫలక్నుమా ప్యాలస్ లో ఆగస్టు 8న రానా-మిహీకలు ఒక్కటి కానున్నారు. అయితే రెండు రాష్ట్రాలలో సురేష్ బాబుకు వ్యాపారాలు ఉన్నాయి. అందువల్ల ఇరు ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఆహ్వానం అందించనున్నారని ఇండస్ట్రీ టాక్. ఇటీవలే హీరో నితిన్ కూడా సీఎం కెసిఆర్ ను ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News