అరియానా క్రేజ్‌ మరింత పెంచిన వర్మ

Update: 2020-12-07 05:34 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో అరియానా ఉంది అంటే అది ఖచ్చితంగా రామ్‌ గోపాల్‌ వర్మ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక ఇంటర్వ్యూలో రామ్‌ గోపాల్‌ వర్మను అరియానా మీకు ఈమద్య కాలంలో ఏ అమ్మాయిని చూసినప్పుడు వావ్‌ అనిపించింది అంటూ ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానంగా వర్మ ఠక్కున నిన్నే అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ వీడియోలు కొన్ని వారాల పాటు వైరల్‌ అయ్యాయి. దాంతో అరియానా బాగా ఫేమస్‌ అయ్యింది. వాటి తర్వాత మరిన్ని షోలు చేయడం.. హోస్టింగ్‌ చేయడం ఇంటర్వ్యూలు చేయడంతో బిగ్‌ బాస్‌ లోకి ఛాన్స్‌ వచ్చింది. వర్మ వల్ల బిగ్‌ బాస్‌ లోకి వెళ్లిన అరియానా ఇప్పుడు కష్టపడి ఫైనల్‌ 6 వరకు చేరింది. ఫైనల్‌ పోరు కోసం పోరాటం చేస్తోంది.

ఈ సమయంలో మరోసారి వర్మ నోటి నుండి అరియానా గురించి ప్రస్తావన రావడంతో ఆమెకు మరింత పాపులారిటీ దక్కింది. ఈసారి వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్‌ బాస్‌ లో అరియానా ఉంది కదా మీ ఉద్దేశ్యం ఏంటీ అంటూ ప్రశ్నించగా నాకు బిగ్‌ బాస్‌ గురించి తెలియదు. నేను అసలు చూడను. షో లో ఎంత మంది ఉంటారు అంటూ ప్రశ్నించాడు. షో లో మొత్తం 16 మంది ఉంటారు అరియానా ఫైనల్‌ 5 కోసం పోరాటం చేస్తుందని వర్మతో అన్నారు. అంటే 5 మంది విజేతలు అవుతారా అంటూ వర్మ మరింత ఇన్నో సెంట్‌ గా అడిగాడు. అదే సమయంలో అరియానాతో ఒక సినిమా తీస్తాను అంటూ ప్రకటించాడు. వర్మ కు అంతగా నచ్చిన అరియానా మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఆమెకు మరోసారి వర్మ వ్యాఖ్యలు ప్లస్‌ అవుతాయని ఫైనల్‌ 5 లో ఖచ్చితంగా అరియానా ఉంటుందనే నమ్మకంను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News