వ‌ర్మ పేల్చిన పెద్ద జోక్‌..

Update: 2016-03-22 15:30 GMT
రామ్ గోపాల్ వ‌ర్మ ఏం మాట్లాడినా.. ఏ ప‌ని చేసినా.. ఏ సినిమా చేసినా పూర్తి స్పృహ‌తోనే చేస్తాడ‌ని అంద‌రికీ తెలుసు. రెండు ద‌శాబ్దాల కింద‌టే అత్య‌ద్భుత‌మైన సినిమాలు తీసిన వ‌ర్మ‌.. ఏదో మాయ‌లో ప‌డి పిచ్చి సినిమాలు తీసేస్తాడ‌ని ఎవ్వ‌రూ అనుకోరు. వ‌ర్మ లాంటి వాడికి ఎవ‌రో వ‌చ్చి.. ఈ టైపు సినిమాలు తీయొద్దు.. ఫ‌లానా త‌ర‌హా సినిమాలు తీయ‌మ‌ని చెప్పాల్సిన ప‌ని లేదు. ఐతే వ‌ర్మ మాత్రం త‌న‌కు నిర్మాత ఓ నిర్మాత‌ ద్వారా జ్నానోద‌యం అయింద‌ని చెబుతూ పెద్ద జోక్ ఒక‌టి పేల్చాడు. ఆ నిర్మాత మ‌రెవ‌రో కాదు.. సి.క‌ళ్యాణ్‌. వ‌ర్మ‌తో ‘ఎటాక్’ మూవీ తీసింది ఈయ‌నే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ‘ఎటాక్’ ఆడియో ఫంక్ష‌న్ లో మాట్లాడుతూ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

‘‘ఐస్ క్రీమ్ - ఐస్ క్రీమ్ 2 సినిమాలు తీస్తున్న స‌మ‌యంలో నువ్వు తీయాల్సింది ఇలాంటి సినిమాలు కాదు అంటూ సి.క‌ళ్యాణ్ నాకు రెండు గంట‌లు క్లాస్ తీసుకున్నారు. దాని ఫ‌లిత‌మే ఎటాక్ మూవీ’’ అని చెప్పాడు వ‌ర్మ‌. వ‌ర్మ లాంటి వాడికి క్లాస్ తీసుకునే స్థాయి క‌ళ్యాణ్ కు ఉందా.. ఒక‌వేళ ఆయ‌న క్లాస్ తీసుకున్నంత మాత్రాన వ‌ర్మ మారిపోతాడా.. అన్న‌ది ఇక్క‌డ సందేహం. ఇలాంటి మాట‌లు చెప్పి కామెడీ చేయ‌డం వ‌ర్మ‌కు అల‌వాటే. అయినా ఐస్ క్రీమ్‌, ఐస్ క్రీమ్‌-2 లాంటి సినిమాల గురించి వ‌ర్మ చాలా గొప్ప‌గానే చెప్పుకున్నాడు ఇంత‌కుముందు. ఈ సినిమాలు చెత్త అన్న‌వాళ్ల‌తో యుద్ధానికి కూడా దిగాడు. ఇప్పుడా సినిమాల్ని తేలిక చేసి మాట్లాడ్డం భావ్య‌మా?
Tags:    

Similar News