స్టార్స్ వ్యవసాయమో వంటో చేసుకోవాలట

Update: 2015-08-28 06:20 GMT
రామ్ గోపాల్ వర్మ మామూలోడు కాదు. జనాల్ని ఎలా ఆకర్షించాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన పెట్టే ట్వీట్లు చదివాక.. ఏముంది ఇందులో కొత్తగా, ఎప్పుడు ఉండే వాయింపుడేగా అనిపిస్తుంది. కానీ మళ్లీ ఆయన ఏం ట్వీట్ చేస్తాడా అని ఎదురు చూడ్డం కామన్. ఒకప్పుడు సినిమాలతో ఆకర్షించిన వర్మ.. ఇప్పుడు తన ట్వీట్లతో జనాల్ని అలా ఆకర్షిస్తున్నాడు. వర్మ కేదైనా నచ్చిందంటే దాన్ని సూపర్ లేటివ్ డిగ్రీలో చెప్పడం అలవాటైపోయింది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లను వాళ్ల సినిమాలు రిలీజైనపుడు ఆకాశానికెత్తేసిన వర్మ.. ఆ తర్వాత బాహుబలి టైంలో రాజమౌళిని, ప్రభాస్ ను తన మాటలతో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఆయా సమయాల్లో మిగతా వాళ్లను చీమల్లా చూశాడు. ఇప్పుడు అఖిల్ విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నాడు.

అందరూ అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుతుంటే.. వర్మ సినిమా లోతుల్లోకి వెళ్లిపోయాడు. ఎవరో ‘అఖిల్’ సినిమా రషెస్ చూశారట. అది చూశాక అందరు మెగా - సూపర్ - పవర్ - రెబెల్ - క్రేజీ స్టార్లందరూ ఇక వ్యవసాయం, వంట లాంటి వేరే వృత్తుల్ని ఎంచుకోవడం బెటర్ అని చెప్పారట. రషెస్ చూసిన వ్యక్తి ఏం చెప్పాడో కానీ.. మిగతా పెద్ద స్టార్లందరూ ఆల్టర్నేట్ చూసుకోవాలని చెప్పడం మాత్రం వర్మ మాటే అనడంలో ఎవరికీ సందేహాల్లేవు. వర్మ అంతే మరి.. ఆ సమయానికి ఆయనకు ఎమోషన్ పీక్స్ కు వెళ్లిపోతోంది. ఎవర్నయితే పొగుడుతున్నాడో ఆ వ్యక్తి కూడా సిగ్గుపడిపోయేలా పొగిడేయడం వర్మకు అలవాటు. వర్మ మాట పక్కనబెడితే.. ‘అఖిల్’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందనేది వాస్తవం. మరే అరంగేట్ర హీరో ఫస్ట్ లుక్ కూడా ఇంత ఎఫెక్టివ్ గా లేదని అంటున్నారు టాలీవుడ్ జనాలు. సినిమా మీద ఇప్పటికే ఉన్న అంచనాల్ని మరింత పెంచేసింది ఫస్ట్ లుక్.
Tags:    

Similar News