గురు శిష్యుల `గానా`బజానా...వైరల్ వీడియో!
ఆ ఇద్దరు టాలీవుడ్ దర్శకులకు చాలాకాలం నుంచి చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఇండస్ట్రీలో తనకు గుర్తింపు తెచ్చిన సినిమాకు సీక్వెల్ గా భావిస్తున్న సినిమా షూటింగ్ ను ఒకరు ప్రారంభించి...ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. తన సొంత కొడుకునే హీరోగా పెట్టి చేస్తున్న సినిమా షూటింగ్ లో మరొకరు అవుట్ డోర్ షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. అనూహ్యంగా ఆ ఇద్దరు దర్శకులు వీకెండ్ పార్టీలో కలిసి ఎంజాయ్ చేశారు. అక్కడ వినసొంపైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ మైమరిచిపోయారు. ఆ ఇద్దరు దర్శకులు మరెవరో కాదు....టాలీవుడ్ లో విలక్షణ దర్శకులుగా పేరు పొందిన గురుశిష్యులు రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్. తమ సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ హైదరాబాద్ లో వీకెండ్ పార్టీలో పాల్గొని సందడి చేశారు. అంతేకాదు, అక్కడ ఓ వయొలినిస్ట్ ప్లే చేసిన పాటను తెగ ఎంజాయ్ చేశారు. ఆ వయొలినిస్ట్ ను వర్మ పొగడ్తలతో ముంచెత్తడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీకెండ్ పార్టీలో వర్మ - పూరీ - చార్మి తో పాటు మరికొంతమంది వర్మ - పూరీల శిష్యగణం పాల్గొంది. అక్కడ వర్మ - పూరీ అండ్ కో `పార్టీ`ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఓ గిటారిస్ట్ ...మైఖేల్ జాక్సన్ పాటకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అద్భుతంగా వాయించాడు. ఆ పాట పూర్తయిన వెంటనే ఆ గిటారిస్ట్ కు వర్మ తనదైన శైలిలో అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చాడు. పార్టీ `కిక్`లో ఉన్న వర్మ "సార్... ఐ వాంట్ టు టచ్ యువర్ ఫీట్" అని కితాబిచ్చాడు. ``ఇతనో త్యాగరాజు`` అని పక్కనే ఉన్న పూరీ జగన్నాథ్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. వర్మ టీమ్ లోని దాదాపు 15 మంది అక్కడ వంటలు చేస్తూ, సరదాగా మాట్లాడుకుంటూ ఆ మ్యూజిక్ ను ఎంజాయ్ చేశారు. ఆ రేర్ మూమెంట్స్ ను చార్మి స్వయంగా తన కెమెరాలో బంధించింది. ఆ వీడియో చివర్లో చార్మిని కూడా చూడవచ్చు. ఆ `పార్టీ` వీడియోను చార్మి తన ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ చేసింది. దీంతో, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గురు శిష్యుల `గానా`బజానాకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
Full View

Amazing nite with amazing talents