వర్మ గన్ షాట్ తగులుతుందా?

Update: 2018-05-26 17:33 GMT
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ స్థాయిని పెంచేందుకు చాలానే కష్టపడుతున్నాడు. పబ్లిసిటి విషయంలో చాలా తెలివిగా ఆలోచించే వర్మ సినిమాలకు ఎంతో కొంత బజ్ క్రియేట్ చేయగలడు అని అందరికి తెలిసిందే. ఇక ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఆఫీసర్ సినిమాకు మొన్నటి వరకు ఒక స్టైల్ లో ప్రమోట్ చేసిన వర్మ ఇప్పుడు టీజర్స్ తో ఆసక్తిని రేపుతున్నాడు. రీసెంట్ గా మరో టీజర్ ను రిలీజ్ చేశాడు.

 ‘గన్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్‌ సౌండ్‌’ పేరుతో రిలీజ్ చేసిన ఆ వీడియో వర్మ మార్క్ కి తగ్గటుగా ఉంది. చాలా కాలం తరువాత నాగార్జున వర్మ దర్శకత్వంలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆఫీసర్ సౌండ్ జూన్ 1 రిపోర్ట్ వస్తుంది అంటూ రిలీజ్ డేట్ ను చెప్పేశాడు. నాగ్ టేబుల్ కింద నుంచి గన్ తీసి పీల్చడానికి రెడీగా ఉండడం చూసిన తరువాత పేల్చేస్తాడులే అని అంతా అనుకున్న సమయంలో కట్ చేశాడు.

మరి ఈ స్పెషల్ వీడియో ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గాని వర్మ స్టైల్ మాత్రం తన ప్రయత్నాలను తాను చేస్తున్నాడు. ఇక సినిమాను ఈ నెలలోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నప్పటికీ టెక్నీకల్ ప్రాబ్లమ్ వల్ల జూన్ 1కి షిఫ్ట్ చేశారు. మరి 20 ఏళ్ల తరువాత వస్తున్న వర్మ నాగ్  కాంబినేషన్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.   

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News