పవన్‌ కంటే బన్నీ పెద్దోడే మరి!!

Update: 2016-04-27 04:16 GMT
అబ్బే.. మేం చెప్పట్లేదు అలాగ.. వివాదాల మాష్టర్‌ రామ్‌ గోపాల్ వర్మ ఉన్నాడే.. ఆయన చెబుతున్నాడు. మొన్నామధ్యన పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను బాగా ఇరిటేట్‌ చేసి వదిలేసి.. తరువాత పవన్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడను అంటూ మంగమ్మ శపథం చేశాడు రాము. కాని మనోడు మాట మీద ఉండడనే విషయం మనకు తెలిసిందేగా. ఫర్‌ సప్పోజు.. ఒకవేళ మాట మీద ఉండే రకమైతే చిరంజీవి 150వ సినిమానే డైరెక్టు చేసుండేవాడు.

మ్యాటర్లోకి వచ్చేస్తే.. గత రాత్రి మరోసారి తన ట్వీట్లతో మెగా ఫ్యాన్స్‌ మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. ''ఎంతో పెద్దదైన సర్దార్‌ సినిమాకంటే.. సరైనోడు చాలా పెద్ద హిట్‌. అంటే బన్నీ చాలా పెద్దాడనేగా?'' అంటూ పవన్‌ ను చిన్నబూర్చే ఎపిసోడ్‌ కు తెరలేపాడు మన వివాదాల వర్మ. ''అసలు పవన్‌ తో కంపేర్‌ చేస్తే బన్నీ గురించి ఎప్పుడూ ఏమీ ఆలోచించలేదు. కాని సరైనోడు సినిమాతో పవన్‌ కంటే బన్నీ పెద్దాడు అని ప్రూవ్‌ అవ్వడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది'' అంటూ మరో చురక అంటించాడు.

యథావిథిగా అభిమానులు మాత్రం.. నిద్రపోయే ముందు రాము వేసిన ట్వీట్లు చూసి.. ఈ కామెంట్లు మానడు.. అంటూ హ్యాపీగా దుప్పటి కప్పుకుని పొడుకున్నారట. మరేమో రామూ జీ!! ఇంతకీ ఆ వంగవీటి? డాన్‌? XXX? ఇలాంటి సినిమాల సంగతేంటి మాష్టారూ? మెగా సినిమాలు చూసి సెటైర్లు వేయడమేనా.. మీ సినిమా స్ర్కిప్టులు కూడా అప్పుడప్పుడూ చదువుతున్నారా?
Tags:    

Similar News