బాలయ్యను మరింతగా రెచ్చగొడుతున్న వర్మ
వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు తన సినిమాలను వివాదాస్పదం చేయడం కొత్తేం కాదు. కాని ఈసారి తన రూటు మార్చినట్లుగా అనిపిస్తుంది. సినిమా ప్రమోషన్ కోసం కాకుండా, ఏదో కక్ష సాధింపు చర్య మాదిరిగా వర్మ చర్యలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఆయన తన సినిమా పబ్లిసిటీ కోసం రకరకాలుగా కామెంట్స్ చేయడం, వీడియోలు వదలడం చేస్తాడు. అయితే ఈసారి ‘ఎన్టీఆర్’ మూవీని టార్గెట్ చేసి వర్మ తన మూవీ ప్రమోషన్ చేస్తున్నాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ప్రమోట్ చేస్తున్న ముసుగులో ‘ఎన్టీఆర్’ మూవీకి డ్యామేజ్ చేయడంతో పాటు బాలయ్య ను వెంటాడుతూ ఉన్నాడు. ‘ఎన్టీఆర్’ మూవీ విడుదల అవ్వబోతున్న రోజే తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల చేయాలని నిర్ణయించుకోవడం వెనుక పోటీ ఉందని అంతా అనుకున్నారు. కాని తాజాగా ‘ఎన్టీఆర్’ మూవీ ఆడియో మరియు ట్రైలర్ విడుదల రోజున నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో వెన్ను పోటు పాటను విడుదల చేయడం వర్మ కక్ష సాధింపు చర్యే అంటున్నారు.
వెన్ను పోటు పాట విడుదలకు ముందు వర్మ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అందులో బాలకృష్ణ తనతో నీ సినిమాలో స్టార్స్ లేరు అన్నారని, అందుకు నేను స్టార్స్ లేకపోయినా నా సినిమాలో నిజాలు ఉంటాయని, అవి స్టార్స్ కంటే బలంగా పని చేస్తాయని చెప్పానంటూ ఆ వీడియోలో చూపించాడు. ఈ వీడియో విడుదల బాలయ్యను రెచ్చగొట్టడానికే అనేది అందరి అభిప్రాయం. గతంలో ఒక విషయాన్ని రుద్ది రుద్ది చివరకు పెద్ద వివాదాన్ని చేసిన వర్మ ఈసారి బాలయ్య స్పందించి దబిడి దిబిడే అనే వరకు ఊరుకునేలా లేడు. నేడు జరుగబోతున్న ఆడియో విడుదల కార్యక్రమంలో వర్మ ఎటాక్ పై బాలయ్య స్పందించాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాని ఆ వేడుకలో వర్మ గురించి స్పందించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని, ఆయనకు పబ్లిసిటీ ఇచ్చినట్లే అవుతుందని కొందరు అంటున్నారు.