చిరు వ‌ర్సెస్ చెర్రీ.. ఏంటీ కొత్త‌ గొడ‌వ‌?

Update: 2020-07-22 07:15 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల తెరకెక్కిస్తున్న `ఆచార్య‌` చిత్రీక‌ర‌ణ కోవిడ్ వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. నేడో రేపో మ‌హ‌మ్మారీ శాంతిస్తే షూటింగుకి వెళ్లాల‌ని చిత్ర‌బృందం స‌న్నాహ‌కాల్లో ఉంది. ఇప్ప‌టికే 40శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. పెండింగ్ చిత్రీక‌ర‌ణ త్వ‌ర‌గా పూర్తి చేసి రిలీజ్ చేయాల‌న్న ఆత్రంలో ఉన్నారు కొర‌టాల‌. కానీ ప‌రిస్థితి అందుకు అనుకూలంగా క‌నిపించ‌డం లేదు.

అయితే ఈలోగానే ఈ మూవీలో క‌థానాయిక‌ల గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఇందులో న‌లుగురు క‌థానాయిక‌లు తెర‌పై పండ‌గ చేస్తార‌న్న చ‌ర్చా మెగాభిమానుల్ని నిల‌వ‌నీయ‌డం లేదు. చిరు స‌ర‌స‌న కాజ‌ల్ క‌థానాయిక‌గా ఎంపిక‌వ్వ‌గా.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియరా అద్వాణీని ఎంపిక చేశార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. తాజాగా ముంబైలో కోవిడ్ విల‌యం నేప‌థ్యంలో కియ‌రాతో కుద‌ర‌ద‌ని కొర‌టాల బృందం భావిస్తున్నార‌ట‌.

ఇంకా బాల్ చ‌ర‌ణ్ కోర్ట్ లోనే ఉంది. నాయిక ఎంపిక ఛాయిస్ చెర్రీదే. అయితే చిరు మాత్రం కియ‌రా బ‌దులుగా త‌మ‌న్నాని అత‌డి స‌ర‌స‌న నాయిక‌గా ఎంపిక చేస్తే బావుంటుంద‌ని సూచించార‌ట‌. కానీ చ‌ర‌ణ్ మాత్రం అదేమీ ప‌ట్ట‌న‌ట్టుగా జాన్వీక‌పూర్ ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చిరు-చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ కాబ‌ట్టి అతిథి పాత్రకు జాన్వీ అంగీక‌రించే వీలుంది.

ఇక ఈ మూవీలో త‌మ‌న్నాను కేవ‌లం ఓ ఐటెమ్ పాట‌కు ప‌రిమితం చేస్తేనే బావుంటుంద‌నేది ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం అని తెలిసింది. నాయిక ఎంపిక విష‌యంలో మాత్రం డాడీ మాట‌ను కాద‌ని చ‌ర‌ణ్ ఇలా కొత్త నిర్ణ‌యం తీసుకోవ‌డంపై మెగా ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఆ క్ర‌మంలోనే త‌న‌ని ఒప్పించాలంటే భారీ పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేర‌కు గారాల ప‌ట్టీ డాడీ గారైన‌ బోనీ క‌పూర్ గ‌ట్టిగానే డిమాండ్ చేస్తున్నాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News