స్కూల్ డేస్ లో చెర్రీ షాకిచ్చాడిలా
స్కూల్ .. కాలేజ్ డేస్ మెమరీస్ ని ఏ విద్యార్థి అంత తేలిగ్గా మర్చిపోలేరు. లైఫ్ లో ఎన్నో సాధించి ఎంతో ఎత్తుకు ఎదిగేసినా ఆరోజులకు ఉన్న గొప్పతనం జ్ఞాపకాల్లో అలానే నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి స్కూల్ ని గుర్తు చేసుకుని అక్కడికి వెళ్లినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో ఊహించనలవి కాదు. నాటి క్షణాలు కళ్లముందు గుర్తుకొస్తాయి. స్నేహితులు.. ఆటలు.. పుస్తకాలు.. అల్లరి చిల్లర వేషాలు అన్నీ ఒక్కొక్కటిగా జ్ఞప్తికి వస్తాయి. ఆ మెమరీస్ కొంతసేపు నిలవనివ్వవు. ఆ ఆనందం ఊహాతీతంగానే ఉంటుంది. ఇదిగో అలాంటి అనుభూతుల్నే సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. స్టార్ హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చెర్రీ .. తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కి వెళ్లారు.
తమిళనాడు లారెన్స్ స్కూల్ ను చరణ్ ఇటీవల సందర్శించారు. ఆ విజిట్ కి సంబంధించిన ఫొటోలను ఆయన వైఫ్ ఉపాసన ట్విటర్ ద్వారా అభిమానులకు షేర్ చేశారు. స్కూల్ క్యాంటీన్.. డార్మెటరీ.. తరగతి గదులతో పాటు పాఠశాల పరిసరాల్లో చరణ్ సంచరిస్తూ జ్ఞాపకాల్లోకి వెళ్లిన వైనాన్ని ఈ ఫోటోల్లో ఆవిష్కరించారు. చెర్రీ తిరిగి స్కూల్ డేస్ లోకి వచ్చేశారని తెలిపారు. చరణ్ లారెన్స్ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థులతో కలిసి ఫోటో దిగడం ఆసక్తికరం. లారెన్స్ స్కూల్ అనేది లవ్ డేల్ (తమిళనాడు) అనే ఏరియాలో ఎంతో ప్రాచుర్యం ఉన్న స్కూల్. హెన్రీ మోంట్ గోమెరీ లారెన్స్ అనే ఆయన స్థాపించారు.
ఇక చరణ్ కెరీర్ ని పరిశీలిస్తే .. ప్రస్తుతం ఉన్న డజను స్టార్ హీరోల్లో 100 కోట్ల క్లబ్ హీరోగా వెలిగిపోతున్నారు. రంగస్థలం చిత్రంతో కెరీర్ లో మరో మెట్టు పైకి ఎదిగారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తున్నారు. 2020లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. మునుముందు ఇరుగు పొరుగు మార్కెట్లను శాసించే రేంజుకు ఎదగాలన్న పంతం చరణ్ లో కనిపిస్తోంది. మరోవైపు డాడ్ చిరంజీవి హీరోగా అతడు వరుసగా భారీ చిత్రాల్ని నిర్మించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఎంత సాధించినా చిన్ననాటి జ్ఞపకాల్ని మించిన ఆనందం మరొకటి లేదని చెర్రీకి ఆ క్షణం అర్థమై ఉంటుందేమో!!