• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దీపావళి అంటున్న చరణ్!!

దీపావళి అంటున్న చరణ్!!

By - Tupaki Desk
Update: 2018-10-20 09:05 GMT
రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని మెగా ఫాన్స్ ఎదురు చూపులకు ఎంతకీ అడ్డుకట్ట పడటం లేదు. దసరాకు టైటిల్ అనౌన్స్ చేయటమో లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమో ఉంటుంది అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు. ట్విటర్ వేదికగా కొందరు అభిమానులు నిర్మాత దానయ్య మీద బోయపాటి మీద ట్రాలింగ్ కూడా మొదలుపెట్టారు. వీటి వల్ల ప్రయోజనం లేదని తెలిసినా తమ బాధను కోపాన్ని ఇలా ప్రదర్శించేస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ప్రమోషన్ ను దీపావళి నుంచి మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఆ రోజు టైటిల్ ప్రకటిస్తారా లేదా సర్ ప్రైజింగ్ గా చిన్న టీజర్ లాంటిది ఏదైనా వదులుతారా అనే క్లారిటీ మాత్రం లేదు. ఇది అయినా జరిగితే అంత కన్నా కావాల్సింది ఏముంది అంటున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి విడుదలలో ఎలాంటి మార్పు కానీ వాయిదా కానీ ఉండదు అని తేల్చిన నేపధ్యంలో ఎంత రామ్ చరణ్ సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిసిటీ చాలా ముఖ్యం.

అందులోనూ పోటీగా ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ కి కావాల్సినంత హైప్ వారానికో పోస్టర్ తో నటీనటుల లుక్స్ తో పెంచుకుంటూ పోతున్నారు. అదే టైంకి టార్గెట్ చేసిన దిల్ రాజు మల్టీ స్టారర్ ఎఫ్2 కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇవి చాలదు అన్నట్టు రజనీకాంత్ పెట్టా కూడా రేస్ లోకి వస్తుందట. సో చరణ్ దూకుడు పెంచాల్సిందే. వీర విధేయ రామ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ అధికారికంగా చెప్పలేదు. ఇదే ఖరారు అయ్యే సూచనలు జోరుగా ఉన్నాయి.
   

Tags:    
  • Ram charan 
  • RC12 
  • Diwali 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS