చరణ్ ప్లానింగ్ బాగానే ఉంది.. కానీ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చేస్తున్న చరణ్.. కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు చరణ్. తన కెరీర్ లో 15వ చిత్రంగా వస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించనున్నారు. ట్రిపుల్ ఆర్ తో చరణ్ కి పాన్ ఇండియా వైడ్ క్రేజ్ వస్తుంది. అదే రేంజ్ క్రేజ్ తెచ్చుకోవాలంటే స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయడం అనేది గుడ్ ఛాయిస్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజును ఎంచుకోవడం అనేదే ఎక్కడో తేడా కొడుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దిల్ రాజుకు తెలుగు నాట వ్యతిరేకత వ్యక్తం అవుతూ వస్తోంది. ఇప్పటికే దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ చేస్తున్నారు. దిల్ రాజు ఇచ్చే బడ్జెట్ శంకర్ సాంగ్స్ షూట్ చేయడానికి సరిపోతుందని కామెంట్స్ పెడుతున్నాడు. ఏదేమైనా దిల్ రాజు మీదున్న వ్యతిరేకత ప్రభావం ఈ భారీ ప్రాజెక్ట్ మీద పడకుండా ఉంటే రామ్ చరణ్ పాన్ ఇండియా ప్లాన్స్ పదిలంగానే ఉంటాయని చెప్పవచ్చు. కాకపోతే ఇదంతా 'ఆర్.ఆర్.ఆర్' రిజల్ట్ మీద ఆధారపడి ఉంది. ట్రిపుల్ ఆర్ ఫలితం ఏమైనా తేడా కొడితే మాత్రం చరణ్ ఆ ప్రాజెక్టు భారం మొత్తం శంకర్ మీదే వేయాల్సి ఉంటుంది.
ఇదిలావుండగా శంకర్ - చరణ్ కాంబోలో రూపొందనున్న సినిమా మెడికల్ మాఫియా నేపథ్యంలో ఉండబోతుందని.. ఇందిలో చెర్రీ ఓ బయోలాజికల్ సైంటిస్ట్ గా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఇది శంకర్ శైలిలో సామాజిక ఇతివృత్తం నేపథ్యంలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే దాదాపు 30 ఏళ్లుగా తెలుగువాళ్లకి సుపరిచితమైన తమిళ డైరెక్టర్ శంకర్ తెలుగులో తొలిసారిగా స్ట్రైయిట్ సినిమా చేస్తున్నాడు. ఇంతవరకు శంకర్ తన తమిళ డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు వాళ్లని అలరించాడు. మరి డైరెక్ట్ తెలుగు సినిమాతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.