ఆ ఇద్దరిలో చెర్రీ ఓటు ఎవరికో?

Update: 2020-04-28 04:30 GMT
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్‌ లు కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోలు కూడా దాదాపుగా రెండేళ్ల సమయంను కేటాయించారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం పూర్తి అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్టీఆర్‌ తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు. కాని చరణ్‌ తదుపరి చిత్రం విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.

చరణ్‌ కు పలువురు దర్శకులు కథలు వినిపించారు. ముఖ్యంగా యూవీ క్రియేషన్స్‌ లో వరుసగా రెండు హిట్స్‌ అందుకున్న యువ దర్శకుడు ఒక మంచి కథతో చరణ్‌ ను మెప్పించాడట. అతడితో వెళ్లాలని చరణ్‌ భావిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఎఫ్‌ 2 చిత్ర దర్శకుడు అనీల్‌ రావిపూడి కూడా చరణ్‌ కోసం ఒక స్క్రిప్ట్‌ రెడీ చేయడం వినిపించడం కూడా జరిగిందట. అనీల్‌ చెప్పిన స్క్రిప్ట్‌ కు కూడా చరణ్‌ ఆసక్తిగా ఉన్నాడని మెగా వర్గాల వారు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరితో చరణ్‌ సినిమా చేస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటీ అంటే చరణ్‌ తో సినిమా అనుకున్న అనీల్‌ రావిపూడి ఎఫ్‌ 3 చిత్రంకు రెడీ అయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని త్వరలోనే షూటింగ్‌ మొదలు పెడతానంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కనుక చరణ్‌ తో వెంటనే సినిమా ఉంటుందనే నమ్మకం లేదు. కనుక చరణ్‌ ఆ యూవీ క్రియేషన్స్‌ దర్శకుడితో వెళ్తాడా లేదంటే అనీల్‌ రావిపూడి ఎఫ్‌ 3 పూర్తి చేసే వరకు వెయిట్‌ చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి వీరిద్దరిలో చరణ్‌ ఓటు ఎవరికి వెయ్యబోతున్నాడు అనేది ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కాని తెలియదు.
Tags:    

Similar News