రామ్ చ‌ర‌ణ్ - గౌత‌మ్ తిన్న‌నూరి ఫిల్మ్ జోన‌ర్ ఇదే!

Update: 2021-12-17 01:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస‌తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల్లో విడ‌దుల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాల జోరు పెంచేసింది.

మెగా ప‌వ‌ర్ స్టార్ `ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ బిజీగా గ‌డిపేస్తున్నారు. దేశ భక్తి ప్ర‌ధానంగా సాగే యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ ఫాంట‌సీగా రూపొందిన ఈ మూవీపై ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాలున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని 2023కి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ త‌రువాత చిత్రాన్ని కూడా రామ్ చ‌ర‌ణ్ తాజాగా ఫైన‌ల్ చేసేశారు. `జెర్సీ` మూవీతో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గా ఇదిలా పేరు తెచ్చుకున్న గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో సెట్స్ పైకి రానుంది. అయితే ఈ మూవీ నేప‌థ్యం ఏంటీ? ... జోన‌ర్ ఏంటీ అన్న‌ది మాత్రం బ‌య‌టికి రాలేదు. కానీ తాజాగా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా జోన‌ర్ ఏంటో బ‌య‌ట‌పెట్టేశారు. `ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అందులో ఎలాంటి వాస్త‌వం లేదు. ఇదొక యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంటర్‌టైన‌ర్. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి కీ రోల్ పోషించ‌నున్నారంటూ కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది అది కూడా రాంగ్ న్యూసే.

భారీబ‌డ్జెట్ తో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని ఎన్ . వి. ప్ర‌సాద్, హీరో రామ్ చ‌ర‌ణ్ నిర్మించ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది ఎండింగ్ లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది` అని గౌత‌మ్ తిన్న‌నూరి క్లారిటీ ఇచ్చారు.



Tags:    

Similar News