వీడియో: షాకిస్తున్న లేడీ ఘోస్ట్ రైడర్
పంజాబి బ్యూటీ రకుల్ ప్రీత్ కి సౌత్ లో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ప్రభాస్ కజిన్ సిద్ధార్థ్ సరసన ఓ కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ - అటుపై టాలీవుడ్ లో `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` చిత్రంతో విజయం అందుకుని జెట్ స్పీడ్ తో కెరీర్ ని మలుచుకుంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించేసింది. బ్రూస్ లీ - సరైనోడు - ధ్రువ - స్పైడర్ - నాన్నకు ప్రేమతో వంటి టాప్ రేంజ్ సినిమాల కథానాయికగా అగ్రపథంలోకి దూసుకొచ్చింది. ఇటీవలే బాలకృష్ణ- కథానాయకుడు చిత్రంలో శ్రీదేవి గా అభినయించిన సంగతి తెలిసిందే.
ఓవైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు కోలీవుడ్ లోనూ వరుసగా అవకాశాలు అందుకుంటోంది. వెంకటేష్ - నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న `వెంకీ మామ` చిత్రంలోనూ నాయికగా ఫైనల్ అయ్యింది. తమిళంలో సూర్య - కార్తి బ్రదర్స్ ఈ అమ్మడికి అవకాశాలిచ్చారు. సూర్య సరసన ఎన్ జీకే, కార్తి సరసన దేవ్ చిత్రాల్లో నాయికగా నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు హిందీలో మిలాప్ జవేరి చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది. వేరొక బాలీవుడ్ చిత్రానికి ఇటీవలే సంతకం చేసింది. ఇంత బిజీగా ఉన్న ఈ భామ .. ఆన్ లొకేషన్ వెళ్లేందుకు.. మెట్రో నగరాల్ని విమాన మార్గంలో జెట్ స్పీడ్ తో చుట్టేస్తోంది.
ప్రస్తుతం `దేవ్` చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంలో రకుల్ ఇదిగో ఇలా బైక్ రైడింగ్ కూడా చేసింది. `దేవ్ బిహైండ్ సీన్స్.. బైక్ లవ్`` అంటూ రకుల్ ఓ వీడియోని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. ఈ వీడియో తీసింది డైరెక్టర్ అంటూ హింట్ ని ఇచ్చింది. ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కార్తీ ఓ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. అతడి లవర్ గా రకుల్ నటించింది. ఇప్పటికే దేవ్ టీజర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. రకుల్ ఘోస్ట్ రైడర్ లా దూసుకుపోతున్న వీడియో ప్రస్తుతం యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. దేవ్ ప్రమోషన్స్ కి తనవంతు బాధ్యతను తీసుకుందిలా.
వీడియో కోసం క్లిక్ చేయండి