రకుల్.. ఈ కష్టం పగోడికైనా!
పంజాబి బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హార్డ్ వర్క్ గురించి చెప్పేదేం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడమెలాగో సాటి ప్రపంచానికి నేర్పిస్తోంది. టాలీవుడ్‌లో డజను పైగా అగ్రకథానాయికలు ఉన్నా రకుల్ చూపించినంత స్పీడ్ ఇతర నాయికలు చూపించలేకపోయారంటే అతిశయోక్తి కాదు. వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ అగ్ర కథానాయిక అన్న బ్రాండ్ పడిపోగానే వెంటనే ఆ క్రేజును క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసింది. దీపం వెలుగుతుండగానే ఫిట్‌నెస్ జిమ్ముల వ్యాపారంలో దిగిపోయి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారి బోలెడంత పాపులారిటీ తెచ్చింది. తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల జిమ్ములు ప్రారంభించి నెలవారీ ఆదాయం ఆర్జిస్తోంది.
జిమ్ము పెట్టగానే సంబరమా? బ్రాండ్ అంబాసిడర్ గా స్థాయి నిలుపుకోవాలంటే అందుకు ఎంతో శ్రమించాలి. ఓవైపు సినీకెరీర్ ని కాపాడుకోవాలి. మరోవైపు జిమ్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలి. అందుకు తగ్గట్టే రకుల్ హార్డ్ వర్క్ చూస్తుంటే ముచ్చట కలగకుండా మానదు. కేవలం జిమ్ లోనే వారానికి 12 గంటలు పైగా గడిపేస్తోందిట. ఇదిగో ఇలా కఠినమైన వ్యాయామాలు చేస్తోంది. ఈ కష్టం పగోడికైనా కలగకూడదు! అన్నంతగా శ్రమిస్తోంది.
ఫిట్ నెస్ తో ఆరోగ్యం, దాంతోనే ఆదాయం ఎలానో రకుల్ ఓ ఫార్ములాని కనిపెట్టింది. అలాగే ఈ అమ్మడు కేవలం సౌత్ లోనే కాదు, అటు బాలీవుడ్ లోనూ కెరీర్ కోసం చక్కని ప్రణాళికతో దూసుకుపోతోంది. అక్కడ యువహీరో సిద్ధార్థ్ సరసన `మార్జవాన్` అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా కోసం తన రూపాన్ని ఇంకా తీరుగ్గా మార్చుకునేందుకు కఠోరంగా శ్రమిస్తోందిట. నిరంతరం జిమ్ముల్లోనే టైమ్ స్పెండ్ చేస్తూ యోగ సాధనకు సమయాన్ని వెచ్చించి రూపాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అందుకోసం నిపుణుడైన ట్రైనర్ నియమించుకుంది. రకుల్ బాలీవుడ్ ప్రిపరేషన్స్ ఎంత కఠోరంగా ఉంటాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
For Video Click here