ఇండస్ట్రీలో నాకు పోటీ తనే : రకుల్

Update: 2021-01-11 02:30 GMT
సినిమా ఇండస్ట్రీలో పోటీ అనేది సర్వసాధారణం. హీరోలు - హీరోయిన్లతోపాటు దర్శకుల మధ్య కూడా పోటీ ఉంటుంది. ఎవరికి సక్సెస్ వస్తుందో వారే నంబర్ రేసులో ముందుకు దూసుకెళ్తుంటారు. ఫ్లాప్ పలకరించిందంటే.. చలనచిత్ర పరమపద సోపానంలో ఒక పాము మింగేసినట్టే లెఖ్ఖ. అలా.. కిందకు జారగానే.. పక్కన ఉన్నవారు పైకి పాకేస్తారు.

అయితే.. వీరిలో హీరోయిన్ల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. కేవలం 2 నుంచి 5 శాతం లోపే సక్సెస్ రేట్ ఉంటుంది ఇండస్ట్రీలో. దీంతో ఫ్లాప్ లు వచ్చిన హీరోయిన్లు తెరమరుగై పోతుంటారు. చాలా మంది ఒకటీ రెండు సినిమాలతోనే కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఫెయిల్యూర్స్‌ను త‌ట్టుకుని కొనసాగుతుంటారు.

అందుకే.. పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తనకు పోటీగా ఎవరు ఉన్నారనే అంశంపై స్పందించింది పంజాబీ బ్యూటీ ర‌కుల్. ‘వెంక‌టాద్రి’ ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో స్థానాన్ని స్థిర‌ప‌ర‌చుకున్న రకుల్.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో ఎదుగుతూ అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే.. ఇటీవ‌ల అమ్మడి కెరీర్ స్లోడౌన్ అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై స్పందించిన ర‌కుల్ నెంబ‌ర్ గేమ్ పై తనకు పెద్ద‌గా న‌మ్మ‌కం లేద‌న్నారు. సినిమా హిట్ట‌యితే అదే తన గెలుపుగా భావిస్తాన‌న్నారు. అంతేకాకుండా.. తాను భ్ర‌మ‌ల్లో ఉండనని, వాస్తవాలకు అనుగుణంగా ఉంటానన్నారు.

అంతేకాకుండా.. సినిమా సక్సెస్ అయితే పొంగిపోవ‌డం, ఫెయిలైతే.. కుంగిపోవ‌డం లాంటివి త‌న జీవితంలోనే ఉండవన్నారు. అందుకే.. త‌న‌కు పోటీ అంటూ ఎవరూ ఉండరని చెప్పింది. తనకు తానే పోటీగా భావిస్తాన‌ని చెప్పింది రకుల్. ఇత‌రుల‌తో పోల్చుకోవడం అనేది బ‌ల‌హీన మ‌న‌స్కులు మాత్ర‌మే చేసే పని అన్న రకుల్.. అలాంటి వారు మాన‌సికంగా కుంగిపోతుంటార‌ని చెప్పింది.


Tags:    

Similar News