పాపం రకుల్.. రెండు సినిమాలు మిస్?

Update: 2019-02-21 11:33 GMT
బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కు పోయినేడాది అసలు కలిసిరాలేదు. సరే ఈ ఏడాది అయినా బాగుంటుందని ఆశలు పెట్టుకుంటే 'దేవ్' సినిమా డిజాస్టర్ గా నిలిచింది.  ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే చేతికి వచ్చినట్టే ఉంటున్నాయి కానీ మిస్ అవుతున్నాయి. 

'వెంకీమామ' సినిమాలో చైతుకు జోడీగా రకుల్ ప్రీత్ ను ఎంచుకున్నారన్న సంగతి తెలిసిందే.  కానీ రీసెంట్ గా 'మన్మధుడు 2' కోసం నాగార్జున సరసన హీరోయిన్ గా రకుల్ ను ఎంచుకున్నారట. దీంతో 'వెంకీమామ' నిర్మాత సురేష్ బాబు చైతుకు సేమ్ హీరోయిన్ ఉంటే బాగోదని వేరే హీరోయిన్ ను తీసుకోవాల్సింది గా సూచించాడట.  అందుకని రకుల్ స్థానంలో 'నన్ను దోచుకొందువటే' ఫేమ్ నభా నటేష్ ను ఫైనలైజ్ చేశారట.

మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం నుండి కూడా రకుల్ ను తప్పించారని.. రకుల్ స్థానంలో రాశి ఖన్నాను తీసుకున్నారని సమాచారం. తమిళ సూపర్ హిట్ ఫిలిం 'రాట్చసన్' కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.   ఈ సినిమా నుండి రకుల్ ను ఎందుకు తప్పించారనే విషయం మాత్రం సమాచారం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.   ఏదేమైనా షార్ట్ గ్యాప్ లో ఇలా రెండు సినిమాల ఆఫర్లు మిస్ చేసుకోవడం రకుల్ ను నిరాశకు గురి చేసేదే.
   

Tags:    

Similar News