వీడియో : ఇదంతా కరణం మల్లేశ్వరి కోసమేనా రకుల్‌?

Update: 2020-08-12 13:30 GMT
హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు ఫిట్‌ నెస్‌ పై ఎక్కువ శ్రద్ద అనే విషయం తెల్సిందే. ఆ ఆసక్తితోనే ఫిట్‌ నెస్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసింది. పలు బ్రాంచీలను కూడా ఏర్పాటు చేసింది. తనకు ఆసక్తి ఉన్న ఫిట్‌ నెస్‌ ను బిజినెస్‌ గా ఎంపిక చేసుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రెగ్యులర్‌ గా వర్కౌట్స్‌ చేస్తూ ఆ వీడియోలను మరియు ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆమె ఫిజిక్‌ మరియు ఆమెకు వెయిట్‌ లిఫ్టింగ్‌ పై ఉన్న ఆసక్తి కారణంగా ఆమెను కరణం మల్లేశ్వరి బయోపిక్‌ కు సంప్రదించారంటూ వార్తలు వచ్చాయి.

ప్రముఖ రచయిత కమ్‌ నిర్మాత అయిన కోన వెంకట్‌ ఈ బయోపిక్‌ కోసం రకుల్‌ ను ఎంపిక చేసే విషయమై ఇంట్రెస్ట్‌ గా ఉన్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె వర్కౌట్స్‌ వీడియోలు మరింతగా ఎక్కువగా వస్తున్నాయి. లాక్‌ డౌన్‌ సడలించిన తర్వాత ముంబయి నుండి హైదరాబాద్‌ చేరుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం మంచు లక్ష్మితో కలిసి రెగ్యులర్‌ గా వర్కౌట్స్‌ చేస్తోంది.

తాజాగా ఈ వీడియోను చూస్తుంటే రకుల్‌ చాలా కష్టపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ కష్టం అంతా కూడా కరణం మల్లేశ్వరి బయోపిక్‌ కోసం అయ్యి ఉంటుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈమద్య కాలంలో కాస్త ఆఫర్లు తగ్గడంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మళ్లీ ఫిట్‌ నెస్‌ తో అందరి దృష్టిని ఆకర్షించాలని కూడా ఇంతగా కష్టపడుతుందేమో అంటున్నారు.
Tags:    

Similar News