అమ్మడు పవన్ కళ్యాణ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిందా...?

Update: 2020-07-28 10:50 GMT
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ 'కెరటం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు, రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, రామ్ తదితర స్టార్ హీరోలతో నటించిన రకుల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్‌ లోనూ మెరిసింది ఈ బ్యూటీ. అయితే ఇటీవల రకుల్ కి తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. గతేడాది 'మన్మథుడు 2' సినిమాతో పరాజయాన్ని చవి చూసిన రకుల్ ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. అయితే లేటెస్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. 'విరూపాక్ష' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ ఏయమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరియు ప్రజ్ఞా జైస్వాల్ లు హీరోయిన్ గా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పక్కన రకుల్ కూడా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల డైరెక్టర్ క్రిష్ రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించారని.. ఈ సందర్భంగా ఆమె తన ప్రాజెక్ట్ లో యాక్ట్ చేయమని కోరినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే క్రిష్ పవర్ స్టార్ మూవీ కోసం అడిగారా లేదా మరేదైనా ప్రాజెక్ట్ కోసం అమ్మడిని అడిగారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవల క్రిష్ పలు వెబ్ సిరీస్ లను రూపొందించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రకుల్ ని అందుకోసం కూడా అడిగివుండొచ్చని అనుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా రకుల్ ప్రస్తుతం జాన్ అబ్రహంతో కలిసి 'ఎటాక్' మరియు అర్జున్ కపూర్ తో ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమాలో పాటు శివ కార్తికేయన్ తో 'అయలాన్' అనే చిత్రంలో నటిస్తోందని సమాచారం.
Tags:    

Similar News