వీగన్ గా మారిన బ్యూటీపై డ్రగ్స్ ఆరోపణలా..!
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. 'కెరటం' అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్.. నాగార్జున - మహేష్ బాబు - రవితేజ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - నాగచైతన్య - రామ్ - సాయి తేజ్ వంటి హీరోల సరసన నటించింది. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ప్రస్తుతం అర డజను సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే ఇటీవల బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఉందని న్యూస్ రావడం సంచలనంగా మారింది.
డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురు స్టార్ హీరోయిన్లను విచారించారు. దీపికా పదుకొనే - శ్రద్ధా కపూర్ - సారా అలీఖాన్ లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా ఎన్సీబీ ప్రశ్నించింది. అప్పటి నుంచి మళ్ళీ డ్రగ్స్ కేసులో వీరి పేర్లు బయటకు రాలేదు. అయితే హీరోయిన్స్ ఎలాంటి తప్పు చేయకపోవడంతోనే ఎన్సీబీ వారిపై యాక్షన్ తీసుకోలేదని వార్తలు వచ్చాయి. దీంతో రకుల్ కూడా ఏ తప్పూ చేయలేదని ఆమె ఫ్యాన్స్ మద్ధతు తెలిపారు. ఇటీవల ప్రపంచ శాఖాహార దినోత్సవం సందర్భంగా తాను కూడా వీగన్ అనే విషయం రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో ఇప్పుడు వీగన్ గా మారిన రకుల్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు.
వీగన్స్ అంటే కేవలం చెట్ల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకునే వ్యక్తులు. మాంసాహారం మాత్రమే కాదు జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, పెరుగు, నూనె వంటివి కూడా వీళ్ళు తీసుకోరు. వీరు జంతువులను పక్షులను హింసించకూడదనే ఉద్దేశ్యంతో చికెన్ - మటన్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ కి దూరంగా ఉంటారు. ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచనలతో నాన్ వెజ్ కి దూరంగా ఉంటూ కేవలం ఆకుకూరలను మాత్రమే తినడం అంటే మాములు విషయం కాదు. అక్కినేని అమల వంటి కొందరు సెలబ్రిటీస్ మాత్రమే ఈ పద్ధతిని పాటిస్తున్నారు. జంతువులను పక్షులను హింసించకూడదనే ఆలోచనతో నాన్ వెజ్ తో పాటు పాలు - పెరుగు - టీ - నూనె - నెయ్యి వంటి వాటికి దూరంగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఆశ్చర్యమనే చెప్పాలి. ఏదేమైనా రకుల్ ఈ వ్యవహారం తర్వాత కూడా ఎప్పటి లాగే సినిమాలు చేసుకుంటూ కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది.
కాగా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం నితిన్ తో కలిసి ''చెక్'' అనే సినిమాలో నటిస్తోంది. అలానే జాన్ అబ్రహాంతో కలిసి 'ఎటాక్' మరియు అర్జున్ కపూర్ తో ఓ సినిమా చేస్తోంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'ఇండియన్ 2' మరియు శివ కార్తికేయన్ 'అయలాన్' చిత్రంలోనూ రకుల్ హీరోయిన్ గా నటించనుంది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందుతున్న సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది.