#రకుల్.. ఇల్లు రాసిచ్చేవాళ్లుంటే నాకెందుకీ శ్రమ?
గడిచిన కొన్నేళ్లలో యువకథానాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ పై వచ్చినన్ని గాసిప్పులు ఇంకెవరిపైనా రాలేదేమో. వరుస ఫ్లాపులతో సౌత్ లో రకుల్ కెరీర్ జీరో అయిపోయిందని.. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఎఫైర్ సాగిస్తోందని కూడా ప్రచారమైంది. టాలీవుడ్ దర్శకుడితోనూ రకుల్ ఎఫైర్ సాగిస్తోందన్న ప్రచారం సాగింది.
అయితే తనపై గాసిప్పులు రాసేవాళ్లపై రకుల్ తెలివిగా పంచ్ లు వేశారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించనివాళ్లే ఇలా రాస్తారు. అలాంటివాళ్లను పట్టించుకోకూడదు అంటూ లైట్ తీస్కునే వైనం ప్రదర్శించింది. ఇన్నాళ్లలో రకుల్ ఏనాడూ ఇలా స్ట్రెయిట్ గా గాసిప్పులపై స్పందించిందే లేదు.
ఇంతకీ ఈ విషయాల్ని ఏ వేదికపై వెల్లడించింది అంటే.. ఆహా-తెలుగు కోసం సామ్ జామ్ చిట్ చాట్ లో ఏదీ దాచని రకుల్ ప్రతిదీ ఓపెనైంది. రకుల్ నివసిస్తున్న ఫ్లాట్ ను ఎవరో బహుమతిగా ఇచ్చినట్లు కొన్ని గాసిప్ లు ఉన్నాయని ``అలాంటి బహుమతులు పొందగలమా? ఆదాయ ఆర్జనకు ఎందుకు అంత కష్టపడాలి?`` అంటూ రకుల్ ఎదురు ప్రశ్నించింది. దీనిని బట్టి రకుల్ తనపై గాసిప్స్ కి స్పందించదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రకుల్ ప్రస్తుతం పలు క్రేజీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయుడు 2 తన కెరీర్ లో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ కానుంది.