రకుల్‌ డబుల్‌ రోల్‌.. వర్కౌట్‌ అయ్యేనా?

Update: 2020-07-21 08:50 GMT
హీరోయిన్‌ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మహేష్‌ బాబు.. రామ్‌ చరణ్‌.. ఎన్టీఆర్‌ వంటి స్టార్స్‌ తో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే కాలం కలిసి రాలేదో మరేంటో కాని రకుల్‌ హడావుడి మూడు నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. ఆమె స్టార్‌ డం రెండేళ్లపాటే కొనసాగింది. గత రెండు సంవత్సరాలుగా రకుల్‌ కనీసం ఆఫర్లు కూడా లేక అల్లాడి పోతుంది. వచ్చిన ఒకటి రెండు ఆఫర్లు ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలను తెచ్చి పెట్టలేక పోయాయి. ఇలాంటి సమయంలో వెబ్‌ సిరీస్‌ దారి పట్టింది.

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ తో పాటు సౌత్‌ లో సమంత.. కాజల్‌ వంటి స్టార్‌ హీరోయిన్స్‌ వెబ్‌ సిరీస్‌ లో ఇప్పటికే నటించారు. త్వరలో ఆ వెబ్‌ సిరీస్‌ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సమయంలో రకుల్‌ కు కూడా ఒక వెబ్‌ సిరీస్‌ ఛాన్స్‌ వచ్చింది. కవల పిల్లల పాత్రలో రకుల్‌ కనిపించబోతుంది. కవల అమ్మాయిల మద్య జరిగే కథ ఆధారంగా రూపొందబోతున్న వెబ్‌ సిరీస్‌ లో రకుల్‌ నటించబోతుంది. రకుల్‌ ద్విపాత్రాభినయం చేయబోతుంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిగా ఈ వెబ్‌ సిరీస్‌ తో తన ప్రతిభను కనబర్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వెబ్‌ సిరీస్‌ కు కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఒక వేళ ఈ వెబ్‌ సిరీస్‌ కనుక మంచి హిట్‌ అయ్యి ఆమె నటనకు మంచి మార్కులు పడితే ఖచ్చితంగా సినిమా ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే వెబ్‌ సిరీస్‌ కు కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది. మరి రకుల్‌ కు ఈ వెబ్‌ సిరీస్‌ వర్కౌట్‌ అయ్యేనా చూడాలి.
Tags:    

Similar News