రాజేంద్రుడికి ఇప్పుడిలా అవసరమా!?

Update: 2017-03-24 04:34 GMT
ఊ.పె.కు.హ.. అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదు. కొన్నేళ్ల క్రితం నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కారణంగానే ఈ వర్డింగ్ ఫేమస్ అయింది. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అనే సామతను.. ఇలా షార్ట్ ఫామ్ లోకి మార్చేసి మరీ పాపులర్ చేసేశాడు రాజేంద్రుడు. ఇప్పుడు ఊ.పె.కు.హ. అనే టైటిల్ తో.. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అనే ట్యాగ్ లైన్ తో సినిమా కూడా చేసేస్తున్నాడు.

నిధి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అరడజన్ మంది కుర్రాళ్లతో కలిసి రాజేంద్రుడి హంగామా చూపిస్తామంటున్నారు. బోలెడంతమంది భామలు కూడా స్టేజ్ పై కొలువు తీరారు. ఊ.పె.కు.హలో రాజేంద్రప్రసాద్ హీరో అయితే.. సాక్షి చౌదరి హీరోయిన్. రాజేంద్రుడిని పెళ్లి కొడుకు గెటప్ లో చూపిస్తూ పోస్టర్లు కూడా వేశారు. అంతా ఓకే కానీ.. రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడున్న స్థాయికి ఇలాంటి రొమాంటిక్ వేషాలు.. అమ్మాయిలతో చక్కర్లు కొట్టే కేరక్టర్లు అవసరమా అనే మాట వినిపిస్తోంది.

నాన్నకు ప్రేమతో చిత్రంలో కేరక్టర్ ఆర్టిస్ట్ గా రాజేంద్రప్రసాద్ ఏ స్థాయి నటన కనబరిచాడో చూశాం. అంతకుముందు కూడా తండ్రిగా ఓ స్థాయి నటనను చూపించాడు. ఇలాంటి సమయంలో మళ్లీ ఇలాంటి కుక్కల హడావిడి లాంటి సినిమాలు రాజేంద్ర ప్రసాద్ కు అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News