రాజశేఖర్ విలన్ అవతారం ఫిక్స్

Update: 2016-02-11 09:30 GMT
‘అంకుశం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఒకప్పుడు ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగాడు రాజశేఖర్. 90ల చివరి వరకు రాజశేఖర్ బండి బాగానే నడిచింది. కానీ కొత్త దశాబ్దంలోకి వచ్చాక యాంగ్రీ యంగ్ మన్ పరిస్థితి మారిపోయింది. ట్రెండుకు తగ్గట్లు మారలేక క్రమక్రమంగా ఫేడ్ అవుట్ అయిపోతూ వచ్చాడు రాజశేఖర్. కొన్నేళ్లుగా రాజశేఖర్ సినిమాలు విడుదలవడమే గగనంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది ఆయన ఎంతో ఇష్టంగా చేసిన రీమేక్ మూవీ ‘గడ్డం గ్యాంగ్’ కూడా డిజాస్టరవడంతో హీరో వేషాలకు పూర్తిగా తెరదించేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఐతే హీరో వేషాల నుంచి క్యారెక్టర్ రోల్స్ లోకి మారిపోయిన మిగతా సీనియర్ హీరోల బాటలోనే రాజశేఖర్ కూడా నడవబోతున్నట్లు కొంత కాలం కిందట వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకు ముహూర్తం కూడా కుదిరింది. తేజ దర్శకత్వంలో ‘అహం’ అనే సినిమా చేయబోతున్నాడు రాజశేఖర్. అందులో ఆయనది నెగెటివ్ రోల్ అట. రాజశేఖర్ కు ఇందులో ఓ హీరోయిన్ కూడా ఉంటుందట. ఆయన పాత్ర - అవతారం అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయని అంటున్నారు. తన ప్రతి సినిమాకూ ఆహా ఓహో అని ముచ్చట్లు చెప్పి.. చివరికి తీవ్ర నిరాశ మిగులుస్తున్న తేజ ‘అహం’తో అయినా మళ్లీ పుంజుకుంటాడేమో.. రాజశేఖర్ కు కూడా లైఫ్ ఇస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News