• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రియ విషయంలో సీరియస్‌...

శ్రియ విషయంలో సీరియస్‌ అయిన జక్కన్న

By - Tupaki Desk
Update: 2020-06-09 08:10 GMT
రాజమౌళి తన ప్రతి సినిమాకు సంబంధించిన విషయాలను చాలా రహస్యంగా ఉంచాలనుకుంటాడు. బాహుబలి రెండు పార్ట్‌ ల గురించి చిత్ర యూనిట్‌ సభ్యులు కాని నటీనటులు కాని ఎప్పుడు ఏ ఒక్క విషయాన్ని బయట చెప్పలేదు. తమ పాత్ర ఏంటీ కథ ఏంటీ ఎక్కడ షూటింగ్‌ జరుగుతుంది అనే విషయాలను బయట చెప్పవద్దంటూ ముందే నటీ నటులకు మరియు టెక్నీషియన్స్‌ కు రాజమౌళి సీరియస్‌ గా వార్నింగ్‌ ఇచ్చి మరీ చెప్తాడు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి రామ్‌ చరణ్‌ ను కాని ఎన్టీఆర్‌ ను కాని అడిగినప్పుడు ఎప్పుడు కూడా వారు కనీసం చిన్న హింట్‌ ఇచ్చేలా మాట్లాడలేదు. ఏ విషయం అయినా రాజమౌళిని అడగాల్సిందే. ఆయన నుండి ప్రకటన రావాల్సిందే అంటూ సమాధానం దాటవేసేవారు. కాని తాజాగా శ్రియ మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో తాను నటిస్తున్నాను అని చెప్పడంతో పాటు తన పాత్ర ఏంటో కూడా క్లారిటీ ఇచ్చింది. అజయ్‌ దేవగన్‌ భార్య పాత్రలో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌ లో కనిపిస్తానంటూ తాజాగా ఒక సోషల్‌ మీడియా లైవ్‌ చాట్‌ లో శ్రియ మాట్లాడుతూ ఈ విషయాలను వెళ్లడి చేసింది.

సినిమాలో ప్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంటుందని శ్రియ మాటలతో అర్థం అయ్యింది. ఇన్నాళ్లుగా కథ గురించి కనీసం చిన్న లీడ్‌ కూడా లభించక పోవడంతో అంతా ఏంటా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శ్రియ మాటలతో ఎవరికి తోచినట్లుగా వారు కథను అల్లేస్తున్నారు. ఇది రాజమౌళికి ఇబ్బందిగా మారింది. దాంతో శ్రియపై ఈ విషయంలో సీరియస్‌ అయినట్లుగా తెలుస్తోంది. తన గురించి తెలిసి కూడా శ్రియ ఇలా వ్యవహరించడంతో జక్కన్న కాస్త ఎక్కువగానే ఆమె విషయంలో హర్ట్‌ అయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో జక్కన్న ఏదైనా షాకింగ్‌ నిర్ణయం తీసుకుంటాడా లేదంటే వార్నింగ్‌ తో సరి పెడతాడా అనేది చూడాలి.
Tags:    
  • Rrr Release Date 
  • Rrr Movie Motion Poster 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Ram Charan 
  • Alluri 
  • Komaram Bheem 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

Copyright @2026

Powered by Blink CMS