లాక్ డౌన్ పై రాజమౌళి యాక్షన్ ప్లాన్ ఇదే
దేశంలో లాక్ డౌన్ విధించారు. కర్ఫ్యూ అంటే తెలుసు కానీ.. లాక్ డౌన్ అనేదే దేశానికే కొత్త. అందరినీ ఇంట్లోనే బంధించి తాళం వేసే ఈ కొత్త ప్రక్రియను దేశప్రజలు తొందరగానే అలవాటుపడ్డారు. అన్నీ పనులు బంద్ చేసుకొని ఇంట్లోనే టీవీ చూస్తూ.. కుటుంబ సభ్యులతో కాలం గడిపారు.
అయితే అందరి పరిస్థితి ఒకే. కానీ బాహుబలి లాంటి కళాఖండం తీసి తాజాగా 400 కోట్ల బడ్జెట్ తో 'ఆర్ఆర్ఆర్' మూవీ తెరకెక్కిస్తున్న రాజమౌళి ఈ లాక్ డౌన్ లో ఏం చేస్తున్నారు. ఇంతటి విలువైన సమయం లాక్ డౌన్ తో హరించుకుపోయింది. మరి ఈ లాక్ డౌన్ లో జక్కన్న ఏం చెక్కుతున్నారు? ఎలా స్పందిస్తున్నారు. రాజమౌళి టార్గెట్ ఏంటీ అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దానికి తాజాగా రాజమౌళియే స్పందించారు. మీడియాతో ఇంటర్వ్యూలో తన సినిమా, వ్యక్తిగత జీవితాలను పంచుకున్నారు.
రేపటి నుంచి లాక్ డౌన్ అనగానే తనకు రెండే గుర్తుకు వచ్చాయని రాజమౌళి తెలిపారు. ఒకటి సినిమా పనులు.. రెండోది ఇంట్లో నిత్యావసరాలు సమకూర్చుకోవడం అని సమాధానమిచ్చారు. సినిమా పనులు చేస్తూ.. ఇంట్లో సామాను గురించి ఆలోచించాన్నారు. రామరాజు ట్రైలర్ ను లాక్ డౌన్ లోనే వీడియోకాల్స్ చేసుకొని పూర్తి చేశామన్నారు. అందరం ఇంట్లోనే ఉండి సినిమా పనులను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
ఇక లాక్ డౌన్ వల్ల తాను ఇన్నాళ్లు చేయని.. మరిచిపోయిన పనిని చేశానని రాజమౌళి తెలిపారు. తాను పుస్తకాలు చదివి చాలా రోజులైందని.. ఈ ఖాళీ టైంలో పుస్తకాలు మళ్లీ చదువుతున్నానని తెలిపారు.
ఇక తాను ఫ్యామిలీని ఎప్పుడూ దూరం పెట్టలేదని.. సినిమాల్లోనూ వారి ప్రమేయం ఉందని.. అందుకే లాక్ డౌన్ లో కుటుంబంతో గడపడం తనకు కొత్తేమీ కాదని రాజమౌళి వివరించారు.
Full View