సరిక్రొత్త రాజమౌళి ఫిలిం సిటీ?

Update: 2015-09-25 11:23 GMT
మ‌గ‌ధీర‌ - బాహుబ‌లి వంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిలింస్ తెర‌కెక్కించాడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.  ఈ రెండు సినిమాల‌తో అత‌డి పేరు ఇంటా బైటా మార్మోగిపోయింది. 600కోట్ల  క్ల‌బ్ సినిమా తీసి హిందీ ప‌రిశ్ర‌మ‌నే ఒణికించిన ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాజ‌మౌళి టార్గెట్ 1000 కోట్లు. పీకే రికార్డుల్ని పీకేయ‌డ‌మే అత‌డి ల‌క్ష్యం. ఇప్ప‌టికే బాహుబ‌లి 2కి సంబంధించిన ప‌నులు మొద‌ల‌య్యాయి. అధికారికంగా న‌వంబ‌ర్‌లో సినిమా మొద‌ల‌వుతోంది. అయితే ఈలోగానే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కాంపౌండ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ టాలీవుడ్‌ లో చ‌ర్చ‌కొచ్చింది.

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెలంగాణ ప్రాంత‌మైన దోన‌కొండ స‌మీపంలో భారీగా పెట్టుబ‌డులు పెట్టారు. దోన‌కొండ ప‌రిస‌రాల్లో దాదాపు 150 కిలోమీట‌ర్ల దూరంలో 100 ఎక‌రాల భూమి కొన్నారాయ‌న‌. ర‌జాకార్ల ఉద్య‌మానికి కేంద్ర‌మైన క‌ట్టంగూర్ మండ‌ల కేంద్రం ప‌రిస‌రాల్లో ఈ భూమి ఉంద‌ని చెబుతున్నారు. రాజ‌మౌళి కొన్న ల్యాండ్‌ సింగిల్ బిట్ ఫ్లాట్‌. 100 ఎక‌రాలు ఒకే చోట ఉంది. ఇందులో మామిడి తోట‌లు - స‌పోట తోట‌లు ఉన్నాయి. ఓ ప‌శువుల కొట్టాం  ఉంది.  గోబ‌ర్ గ్యాస్ ప్లాంట్ ఉంది. ఇందులోనే ఫామ్‌ హౌస్‌ లో ఫ్యామిలీ స‌మేతంగా ఉంటున్నారు రాజ‌మౌళి.  ఎన్‌ హెచ్ 9 ర‌హ‌దారికి చేరువ‌లో ఈ భూములు ఉన్నాయి.

తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి దోన‌కొండ‌లో ఫిలిం ఇండ‌స్ర్టీ నిర్మించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అక్క‌డ 5వేల ఎక‌రాల్ని ఆయ‌న సినీప‌రిశ్ర‌మ కోసం కేటాయించారు. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి తీసుకున్న నిర్ణ‌యం ఇంట్రెస్టింగ్‌. దోన‌కొండ‌ని సినిమా హ‌బ్‌ గా మార్చే ప్లాన్‌ లో భాగ‌మేనా ఇద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News