ఆ నమ్మకమే ఇంతవరకూ తీసుకొచ్చింది: రాజమౌళి
ఒక భారీ ప్రణాళిక.. ఒక బృహత్తరమైన ప్రయత్నం.. అది అంతం కాని అరాచకం.. అని తెలిసీ ముందగుడు వేయాలంటే గుండెల్లో దమ్ముండాలి. అయినా ముందడుగేశాడు రాజమౌళి. అనుకున్నది సాధించాడు. కొన్ని గంటల్లోనే బాహుబలి మోర్నింగ్ షో. ఈ సందర్భంగా అతడు చెప్పిన ఎక్స్‌క్లూజివ్ పాయింట్స్ మీకోసం...
ప్రాజెక్టు మొదలయ్యాక.. ఏ దశలో ఇంత పెద్ద జర్నీ చేయాల్సి ఉంటుందని ఊహించారు?
మబ్బుల్లోకి దూరాక అవి ఎప్పుడు అంతమవుతాయో చెప్పగలమా? చాలా కష్టం. తొలుత పెద్ద కాన్వాసే అనిపించింది. బడ్జెట్ .. టైమ్ ఇవి రెండూ ఎక్కువ కావాలి. కానీ అక్కడ ఇంకా ఏదీ రూపుదిద్దుకోనేలేదు. అంతా శూన్యం. ఆ స్థాయి నుంచి ఒక్కో అడుగు పడింది. ఘాడమైన మబ్బులోకి దూరాక కూడా వాటినుంచి బైటికి రావడానికి వేరొక మార్గాన్ని కనిపెట్టవచ్చనిపించింది. అదే ఇంతింతై వటుడింతై అన్న చందంగా ప్రాజెక్టు పెరగడానికి కారణం. నిర్మాతల నమ్మకమే ఇంత దూరం తీసుకొచ్చింది. నా నిర్మాతలు నాతో చివరివరకూ ఉన్నారు. అందుకే ఈ విజయం.
450 రోజుల షూటింగ్ అంటే అందరినీ కన్విన్స్ చేయగలిగారా?
సాబు సిరిల్ ఈ సినిమాకి టోటల్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేశాడు. ఎంత సమయం కావాలన్నా మాతోనే ఉన్నాడు. సెంథిల్ కూడా. రెండు మూడేళ్ల సమయం పడుతుంది అని వాళ్లందరికీ నా కంటే బాగా తెలుసు. కానీ అందుకు సై అన్నారు. నటీనటులు, టెక్నీషియన్లు నాకంటే బాగా ముందుగా టైమ్ గురించి ఆలోచించారు. అర్థం చేసుకున్నారు. కావాల్సినంత సమయం వెచ్చించారు. 50రోజులు కాదు.. రెండున్నరేళ్లు పడుతుందని ప్రభాస్ సైతం ఫిక్సయ్యాడు.
రామోజీ ఫిలింసిటీలో తిష్ట వేశారు కదా!
అదే మా బలం. ఓ క్యారెక్టర్‌ని ఎలా డిజైన్ చేయాలి. తెరపై ఎలా చూపించాలి. పాత్ర హావభావాలేంటి? ఎలా కనిపించాలి? వంటి అన్ని విషయాల్లో క్లారిటీతో ముందుకు వెళ్లాం. సెట్స్‌ని కావాల్సిన విధంగా తయారు చేసుకున్నాం. నటీనటుల్ని ఏ సెట్‌లో ఎలా చూపిస్తామో ముందే రిహార్సల్స్ చేసుకున్నాం. ముందు అనుకున్నది మార్చాలా వద్దా? అన్నదానిపైనా ముందుగానే కసరత్తులు చేసేవాళ్లం. ప్రధాన కథలో కించిత్ కూడా మార్చ కూడదు. కానీ ఇంకా ఏదో కావాలి. అలాంటప్పుడు కూడా కథలో ఎమోషన్‌లో ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించగలిగాం.
షూటింగ్‌లో 1వ రోజు, 200 వ రోజు.. తేడా ఏం చూశారు?
అలాంటి సెన్సేదీ లేదు. 400వ రోజు ఏం సాధించాం అనుకున్నామో అదే ప్రతి సందర్భంలోనూ ఎఛీవ్ చేయగలిగాం. 200వ రోజుకి ఏం సాధించాలనుకున్నామో అది సాధించుకున్నాం.
విఎఫ్‌ఎక్స్ ఉన్నా.. చాలామంది జనాల్ని ఉపయోగించినట్టున్నారు?
2000 నుంచి 2500 మంది నిత్యం ఆన్‌సెట్స్ కనిపించేవారు. ప్రతి రోజూ కాకపోయినా అప్పుడప్పుడు. వందల సంఖ్యలో గుర్రాల్ని, ఏనుగుల్ని కంట్రోల్ చేయడం అంటే ఆషామాషీనా.. ఒక్కసారి ఊహించండి.