RRR: బాలీవుడ్ స్టైల్ ప్రమోషన్స్!

Update: 2020-02-16 12:47 GMT
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ 'RRR' షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.  ఈ సినిమా రిలీజ్ డేట్ పై కొన్ని రోజులు సందిగ్ధత నెలకొని ఉన్నప్పటికీ ఈమధ్యే కొత్త డేట్ ప్రకటించారు.  వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 'RRR' రిలీజ్ కానుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

రాజమౌళి సినిమాలకు ప్రచారం విభిన్నంగా ఉంటుంది. వినూత్నమైన టెక్నిక్స్ ఉపయోగిస్తూ సినిమాపై హైప్ ను ఆకాశానికి తీసుకుపోతారు.  ఈసారి కూడా 'RRR' కు అలాంటి టెక్నిక్స్ వాడుతున్నారట. 'RRR' కోసం బాలీవుడ్ స్టైల్ లో ఒక ప్రమోషనల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట.  ఈ పాట సినిమాలో మాత్రం ఉండదు కానీ చివర్లో టైటిల్స్ రోల్ అయ్యే సమయంలో వేస్తారని సమాచారం.  'RRR' విడుదలకు నాలుగు నెలల ముందుగా ఈ పాటను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.  ఒకేసారి ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేస్తారని అంటున్నారు.   సహజంగా బాలీవుడ్ సినిమాలకు ఇలాంటి ప్రమోషనల్ సాంగ్స్ ప్లాన్ చేస్తుంటారు. ఈసారి జక్కన్న కూడా ఈ టెక్నిక్ ఫాలో కావడం ఆశ్చర్యకరమే.

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్‌ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్.. సముద్రఖని.. రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

 
Tags:    

Similar News