100, 500... మహేష్ లెక్క పెరుగుతోంది
శ్రీమంతుడుతో మహేష్ వంద కోట్ల అంతు చూసేశాడు. అంతే ఇప్పుడు వంద కోట్లు ఖర్చు పెట్టి సూపర్ స్టార్ తో సినిమా చేస్తానని.. వివి వినాయక్ ప్రకటించేశాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి కూడా. వినాయక్ - మహేష్ ల నెక్ట్స్ వెంచర్ ఇదేననే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో మరో హాట్ న్యూస్ బయటకొచ్చింది.
బాహుబలి సీక్వెల్ రిలీజ్ చేశాక.. గరుడ అంటూ మరో మహాద్భుతాన్ని తెరకెక్కించే యోచనలో ఉన్నాడు రాజమౌళి. అయితే.. ఇందులో హీరోగా ప్రభాస్ - ఎన్టీఆర్ లను పరిశీలించినా.. గరుడ పాత్రకు మహేష్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నాడట రాజమౌళి. ఈ మూవీకి 500 కోట్ల బడ్జెట్ ని వెచ్చించాలన్నది రాజమౌళి ఆలోచన. ఇంతటి వెంచర్ ని మార్కెట్ చేయాలంటే.. అంత ఇమేజ్ ఉన్న హీరో కావాలి. అంతే కాదు అంత పెద్ద మొత్తాన్ని ఏర్పాటు చేసే నిర్మాత కూడా కావాలి. మహేష్ ఒక్కడితో 500 కోట్ల మార్కెట్ సాధ్యం అయ్యే విషయం కాదు. కానీ అప్పటికే బాహుబలి రెండు భాగాలతో జక్కన్న రికార్డులు సాధించేస్తాడు. సో.. ఇద్దరి కాంబినేషన్ లో 500 కోట్ల టార్గెట్ రీచ్ అవ్వాలి.
గరుడకు మంచి స్టోరీ ఇచ్చేందుకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కృషి చేస్తుండగా.. టాలీవుడ్ - బాలీవుడ్ తోపాటు విదేశీ నిర్మాణ సంస్థలను కూడా భాగస్వామ్యం చేసే యోచనలో ఉన్నాడు రాజమౌళి. ఏమైనా... ఇప్పుడు 100 - 500.. ఇలా పెరుగుతున్న పెద్ద అంకెలకు.. సూపర్ స్టార్ మహేష్ నే ఎంచుకుని ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుండడం ప్రత్యేకమైన విషయమే.