చివరి సినిమాను ప్రకటించిన రాజమౌళి

Update: 2019-03-14 08:11 GMT
ఎన్నడూ లేనిది రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో చాలా సేపు మీడియా ప్రతినిధులతో ముచ్చటించాడు. చాలా ఓపిగ్గా కొందరు సహేతుకమైన ప్రశ్నలతో కొందరు ఇప్పుడు ఇవి అవసరమా అనిపించేవి అడిగినా కూడా నవ్వుతు బదులిస్తూ దాదాపు ప్రతి ఒక్కరికి మిస్ చేయకుండా సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగానే జక్కన్న డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం ప్రస్తావన కూడా వచ్చింది. ప్రతి సారి ఇది అడుగుతూ ఉంటారని తానెప్పుడు మహాభారతం చేయబోతున్నాను అని చెప్పలేదని కేవలం అది తన జీవిత లక్ష్యంగా మాత్రమే చెప్పుకున్నానని క్లారిటీ ఇచ్చాడు.

ఒకవేళ తీసే సాహసం చేస్తే కనివిని ఎరుగని స్థాయిలో దాన్ని తీసి తర్వాత రిటైర్ అయిపోతాననే తరహాలో వ్యాఖ్యానించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. యమదొంగ టైం నుంచే దీని మీద కథనాలు వస్తున్న నేపధ్యంలో రాజమౌళి ఇలా రియాక్ట్ అవ్వడం వింతే. ఒక్కటి మాత్రం స్పష్టం. రాజమౌళికి ఇప్పట్లో మహాభారతం తీసే ఆలోచన లేదు. చాలా భారీ కాన్వాస్ తో వందలు కాదు వేయి కోట్లైనా అవసరం పడే అలాంటి ప్రాజెక్ట్ తీయడం అంటే మాటలు కాదు. దానికి తోడు ఇప్పటికే కన్నడ తమిళ్ మలయాళంలో వివిధ రకాల మహాబారత కథలపై భారీ ఎత్తున సినిమాల నిర్మాణం జరుగుతోంది.

ఇలాంటి సమయంలో రాజమౌళి మహాభారతం ఆలోచన చేయకపోవడమే మంచిది. ఒకవేళ మనకు చూడాలని ఉన్నా చాలా సంవత్సరాలు వేచి చూడాలి. ఎందుకంటే అది తనకు చివరి సినిమా అవుతుంది అన్నాడు అంటే బాగా లేట్ ఏజ్ లోనే తీయాల్సి ఉంటుంది. అప్పటిదాకా మనం లెక్కలు అంచనాలు వేసుకోలేం కాబట్టి రాజమౌళి మహాభారతం కార్యరూపం కార్యరూపం దాల్చడం కష్టమే అన్న భావం అయితే ఆయన మాటల్లోనే బయటపడింది
Tags:    

Similar News