కనుమరుగయ్యే టైంలో హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నం

Update: 2020-04-27 05:45 GMT
2013లో వచ్చిన ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా రాజ్‌ తరుణ్‌ హీరోయిన్‌ గా చిన్నారి పెళ్లి కూతురు అవికా గౌర్‌ లు పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే వీరిద్దరు కూడా చిన్న రేంజ్‌ స్టార్స్‌ అయ్యారు. రాజ్‌ తరుణ్‌ వరుసగా సక్సెస్‌ లు దక్కించుకోవడంతో జూనియర్‌ మాస్‌ మహారాజ్‌ అంటూ పేరు దక్కించుకున్నాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా రాజ్‌ తరుణ్‌ వరుసగా ఫ్లాప్స్‌ చవిచూస్తున్నాడు. వరుసగా చేస్తున్న సినిమాలు ఫ్లాప్స్‌ అవుతున్న నేపథ్యంలో రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ ముగియనుందా అంటూ కూడా సినీ వర్గాల్లో చర్చ జరిగింది.

మరో వైపు అవికా గౌర్‌ కూడా మొదటి సినిమాతో వచ్చిన సక్సెస్‌ ను కెరీర్‌ ఆరంభంలో బాగానే ఉపయోగించుకుంది. కాని ఆ తర్వాత తర్వాత ఈ అమ్మడికి ఆఫర్లే కరువయ్యాయి. మద్యలో బరువు తగ్గేందుకు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ తీసుకుంది. రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ బిజీ అవ్వాలని ప్రయత్నించింది. కాని ఆమెకు రీ ఎంట్రీలో కూడా ఆఫర్లు దక్కలేదు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల జంట కనుమరుగయ్యే టైంలో ఉన్నారని టాక్‌ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో వీరిద్దరు కూడా మూడవ సారి జత కట్టేందుకు రెడీ అయ్యారు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ గోవిరెడ్డి దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. ఉయ్యాల జంపాల మరియు సినిమా చూపిస్తా మావ చిత్రాలతో సక్సెస్‌ ఫుల్‌ జంటగా పేరు దక్కించుకున్న వీరిద్దరితో సినిమా చేసి ఆ జంటకు హ్యాట్రిక్‌ ఇవ్వాలని దర్శకుడు శ్రీనివాస్‌ గోవిరెడ్డి భావిస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యిందని ఈ లాక్‌ డౌన్‌ లేకుంటే షూటింగ్‌ కూడా మొదలయ్యేదని అంటున్నారు.

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో రాజ్‌ తరుణ్‌ మరోసారి ఈయన దర్శకత్వంలో చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అవికా కూడా రాజ్‌ తరుణ్‌ తో సినిమా చేసి హిట్‌ కొట్టి మళ్లీ బిజీ అవ్వాలని ఆశగా ఎదురు చూస్తోంది. ఈ టైంలో వీరిద్దరు హ్యాట్రిక్‌ కొట్టడం అంటే చాలా పెద్ద విషయం. మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.
Tags:    

Similar News