• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్‌ స్టార్స్‌...

సూపర్‌ స్టార్స్‌ తలదించుకునేలా చేసిన డాన్స్‌ మాస్టర్‌

By - Tupaki Desk
Update: 2020-04-10 07:30 GMT
కరోనా విపత్తు నేపథ్యంలో సినిమా స్టార్స్‌ పలువురు తమకు తోచినంత సాయంను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. లక్షలు.. కోట్లు ఎవరికి తోచినది వారు ఇస్తూ తమ మనసు చాటుకుంటున్నారు. ఈ సమయంలో దర్శకుడు రాఘవ లారెన్స్‌ మూడు కోట్ల విరాళంను ప్రకటించి సౌత్‌ సినీ స్టార్స్‌ అంతా కూడా తల దించుకునేలా చేశాడు. స్టార్స్‌.. సూపర్‌ స్టార్స్‌ కూడా కోటికి అటు ఇటుగానే సాయం చేశారు. కాని లారెన్స్‌ మాత్రం ఏకంగా మూడు కోట్ల విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే.

ఒక సామాన్య డాన్సర్‌ స్థాయి నుండి ప్రస్తుతం డైరెక్టర్‌ స్థాయికి ఎదిగిన లారెన్స్‌ ఇచ్చిన విరాళం నిజంగా అభినందనీయం. స్టార్‌ హీరోలు తీసుకునే పారితోషికంలో కనీసం పావుల వంతు కూడా పారితోషికంగా అందుకోని లారెన్స్‌ విరాళం విషయంలో మాత్రం సూపర్‌ స్టార్స్‌ కు మూడు నాలుగు రెట్ల అధిక  స్థాయిలో ఇచ్చి అందరి కంటే తానే సూపర్‌ స్టార్‌ అంటూ నిరూపించుకున్నాడని లారెన్స్‌ అభిమానులు నెట్టింట ప్రచారం చేస్తున్నారు.

రజినీకాంత్‌.. విజయ్‌.. అజిత్‌ ఇంకా పలువురు స్టార్‌ హీరోలను తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని చూస్తారు. తమ అభిమాన హీరోలను ఎవరైనా ఒక్క మాట అంటే ఏం చేసేందుకు అయినా వెనుకాడరు. వెండి తెరపై హీరోలుగా అద్బుతాలు సృష్టించే సూపర్‌ స్టార్‌ హీరోలు నిజ జీవితంలో మాత్రం లారెన్స్‌ ముందు చిన్న బోయారు.

లారెన్స్‌ ఇచ్చిన విరాళంతో వారంతా కూడా తల దించుకునే పరిస్థితి వచ్చిందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. లారెన్స్‌ కేవలం ఈ విపత్తు సమయంలోనే కాకుండా వందలాది మంది అనాధలను వికలాంగులను తన ఛారిటీ ద్వారా సాకుతున్నాడు. ఆయన మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఫ్యాన్స్‌ పొగడ్తలు కురిపిస్తున్నారు.

వందల కోట్ల రూపాయలు సంపాదించే సూపర్‌ స్టార్స్‌ కోటి రూపాయలు విరాళం ఇచ్చేందుకు కిందా మీదా పడుతున్నారు. అలాంటిది లారెన్స్‌ మూడు కోట్లు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం అంటూ సాదారణ జనాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లారెన్స్‌ ఇచ్చిన విరాళం స్టార్‌ హీరోలు తల వంచుకునేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.


Tags:    
  • Raghava Lawrence donates Rs 3 crores 
  • Raghava Lawrence 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS