సగం ఇళ్లలో సెక్స్ వేధింపులే -రాధిక

Update: 2017-11-17 15:30 GMT
లైంగిక వేధింపులు ఇప్పుడు అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే టాపిక్ పై బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్స్ ను పరిశీలస్తే.. సెక్సువల్ హెరాస్మెంట్స్ అన్నీ గ్లామర్ వరల్డ్ కే పరిమితం అని అంతా అనుకుంటున్నారని.. కానీ అనేక ప్రాంతాల్లో ఈ తరహా వేధింపులు ఉన్నాయని అంటోంది లెజెండ్ బ్యూటీ.

'సగానికి సగం ఇళ్లలో కూడా లైంగి వేధింపులు ఉంటున్నాయి. కేవలం సినిమా రంగంలోనే అనుకోవడం సరికాదు. పిల్లలపై వేధింపులు.. గృహ హింస అనేవి ప్రపంచవ్యాప్తంగానే కాదు.. ఇండియాలో కూడా ఉన్నాయి. ప్రతీ రంగంలోను.. అఖరికి ఇంట్లోనే ఉండే వ్యక్తులు కూడా ఈ వేధింపులకు గురి కావాల్సి వస్తోంది. ఎంతో కొంత వేధింపులను సగానికి సగం మంది వ్యక్తులు ఫేస్ చేయాల్సి వస్తోంది. వీటిని అరికట్టేందుకు కృషి చేయాలి. మహిళలు మాత్రమే కాదు.. పురుషులు కూడా వీటి బారిన పడాల్సి వస్తోంది' అంటోంది రాధికా ఆప్టే.

'మనకు మనమే నో చెప్పడం ద్వారా వీటి నుంచి బయటపడచ్చని అనుకుంటున్నాను. మన లక్ష్యం ఎంత పెద్దదైనా సరే.. ఇలా నో చెప్పడం ద్వారా వాటిని అందుకోవడం కష్టం అవుతుందని భావించినా.. చెప్పాల్సిందే. మన సొంత ట్యాలెంట్ నే నమ్ముకోవాలి. ఒకరు చెబితే ఎవరూ వినకపోవచ్చు. కానీ 10 మంది చెప్పినపుడు అందరూ వింటారు కదా' అంటూ తన అభిప్రాయాన్ని రాధికా అప్టే  నిక్కచ్చిగా చెప్పేసింది.
Tags:    

Similar News