• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు హీరోయిన్.. పాతికేళ్ల...

చిరు హీరోయిన్.. పాతికేళ్ల వేడుక

By - Tupaki Desk
Update: 2016-09-14 13:30 GMT
80ల్లో తెలుగు ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో రాధ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి సరసన 20కి పైగా సినిమాలు చేయడమే కాదు.. తిరుగులేని డ్యాన్సర్ అయిన చిరంజీవికి దీటుగా డ్యాన్సులు చేసి అభిమానుల్ని అలరించింది రాధ. చిరు-రాధ జంటగా చేస్తున్నారంటే చాలు ఆ సినిమా సూపర్ హిట్టే అన్న నమ్మకముండేది. చిరుతో పాటు అప్పట్లో తెలుగులోని స్టార్ హీరోందరితోనూ ఆడిపాడిన రాధ.. హీరోయిన్‌‌ గా డిమాండ్ ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. కేరళకు చెందిన రాధ.. రాజశేఖరన్ నాయర్ అనే తమిళుడిని పెళ్లాడింది. వీరి వివాహం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ భారీ వేడుక నిర్వహించారు.

ఒకప్పుడు తనతో పని చేసిన నటీనటులు.. దర్శకుల్ని ఆహ్వానించి భారీగానే ఈ వేడుక చేసుకుంది రాధ. భారతీరాజా.. సుహాసిని.. అంబిక లాంటి సెలబ్రెటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. హీరోయిన్లుగా మారిన రాధ ఇద్దరు కూతుళ్లు కార్తీక.. తులసిలతో పాటు కొడుకు విఘ్నేష్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నాడు. రాధ కూతుళ్లిద్దరూ సినిమాల్లో అడుగుపెట్టినా సక్సెస్ కాలేకపోయారు. కార్తీక ‘జోష్’ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి కొంచెం పేరు తెచ్చుకున్నప్పటికీ తులసి మాత్రం తొలి సినిమా ‘కడలి’తోనే అడ్రస్ లేకుండా పోయింది. రాధ వివాహ వార్షికోత్సవంలో వీళ్లిద్దరి అవతారం చూస్తే ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్లే అని అర్థమవుతోంది. ఇద్దరూ గ్లామర్ కోల్పోయారు. ఐతే ముంబయిలో.. కేరళలో రెస్టారెంట్లు.. రిసార్టులు ఉన్న రాధ ఫ్యామిలీకి ఆర్థికంగా ఏమీ ఢోకా లేదు. వీరికి బ్రిటన్లో సైతం ఓ రెస్టారెంట్ ఉండటం విశేషం.
Tags:    
  • Radha 
  • Actress Radha 
  • Radha 25th Years Wedding Anniversary 

Similar News

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

Copyright @2026

Powered by Blink CMS