హరీష్ Vs బండ్ల ఎపిసోడ్ ఇంతటితో ఆగదా?

Update: 2020-05-18 17:30 GMT
'గబ్బర్ సింగ్' విడుదలై 8 ఏళ్ళు కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో #8 ఇయర్స్ ఆఫ్ గబ్బర్ సింగ్ అంటూ ఒక హ్యాష్ టాగ్ ను భారీ స్థాయిలో ట్రెండింగ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. చాలామంది ఆ సినిమాతో తమకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్ కూడా పెట్టారు కానీ నిర్మాత బండ్ల గణేష్ పేరు మాత్రం ప్రస్తావించలేదు.

ఒక్క నిజం ఏంటంటే 'గబ్బర్ సింగ్' మెయిన్ టీం అంతా గబ్బర్ సింగులే. ఎవరూ ఎవరికీ తీసిపోరు. హరీష్ శంకర్ తన పేరును ప్రస్తావించలేదు అనే విషయంపై ఘాటుగా స్పందించిన బండ్ల "హరీష్ కు రీమేక్ సినిమాలు తప్ప స్ట్రెయిట్ సినిమాలు చేయడం రాదు" అంటూ వ్యాఖ్యానించాడు. తనపై కామెంట్లు చేస్తే హరీష్ శంకర్ ఊరుకోడు కదా.. క్రెడిబిలిటీ లేనివారు చేసే వ్యాఖ్యలకు నేను స్పందించను అంటూనే చురకలు వేశాడు. "అలాంటి కామెంట్లు దిల్ రాజు.. అల్లు అరవింద్.. మైత్రి నవీన్ లాంటి వారు చేస్తే నేను ఆత్మవిమర్శ చేసుకుంటాను. ఆయన నాకు బ్రేక్ ఇచ్చాడని అంటున్నాడు. అలా అయితే నేను రెండు ఫ్లాపులతో ఉన్న ఓ ప్రొడ్యూసర్ కు బ్రేక్ ఇచ్చానని అనవచ్చు.. కానీ అలా అనను" అంటూ తన స్టైల్ లో తగులుకున్నాడు.

పనిలో పనిగా "ఫ్రీమేకింగ్ చెయ్యడం కంటే రీమేక్ చెయ్యడం గౌరవం" అంటూ బండ్లకు కౌంటర్ ఇస్తూనే పరోక్షంగా కొందరు కాపీ స్పెషలిస్టులు అయిన కొందరు దర్శకులకు కూడా చురకలు అంటించాడు.

ఈ ఎపిసోడ్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ కు మీకు సోషల్ మీడియాలో ఏదో జరుగుతోంది కదా అని అడిగితే బండ్ల సమాధానం ఇస్తూ "అదేమీ లేదు.. కుటుంబ సభ్యుల మధ్య ఏవో జరుగుతూ ఉంటాయి కదా.. ఒకరిని ఒకరు అరుచుకుంటూ ఉంటాం కదా అలానే ఇది కూడా. హరీష్ శంకర్ గొప్ప డైరెక్టర్. నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్" అన్నారు. హరీష్ తో సినిమా చెయ్యబోతున్నారా అని అడిగితే.. "నేను హరీష్ తో సినిమా చెయ్యను. నా లైఫ్ లో హరీష్ శంకర్ తో సినిమా చెయ్యను. ఒక్క సినిమా చేశాను.. చాలు" అన్నారు.

హరీష్ - బండ్ల గబ్బర్ సీరీస్ ఇలా ఉంటే ఇందులోకి మరో నిర్మాత.. వైసిపీ నాయకుడు పీవీపీ ఎంటర్ అయ్యారు. గతంలో బండ్లపై పీవీపీ ఓ చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. పీవీపీ హరీష్ కు మద్దతుగా.. బండ్లపై చురకలు వేస్తూ "పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్ శంకర్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు, నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయిటింగ్". అంటూ ఓ ట్వీట్ చేశారు

పీవీపీ ట్వీట్ కు హరీష్ ఇలా రిప్లై ఇచ్చారు, "మీ 'భాష భావం' రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం. నా వర్క్ ను గుర్తించినందుకు కృతజ్ఞతలు సర్".

చూస్తుంటే ఈ గబ్బర్ సీరీస్ ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. అసలే అందరూ పవర్ఫుల్.. ఎవరూ ఊరుకోరు. ఇంకా ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News