బన్ని టీమ్ కావాలానే లీక్ చేశారంటూ..!
లీకుల బెడద టాలీవుడ్ ని వదిలేట్టు లేదు. ఇది కూడా మహమ్మారీలా వెంటాడుతోంది. ఏళ్ల తరబడి ఇదే క్రతువు. పవన్- అత్తారింటికి దారేది పూర్తి సినిమా ఆన్ లైన్ లో రిలీజైపోయాక.. దేవరకొండ- టాక్సీవాలా సినిమా కూడా ముప్పావు భాగం పైరసీలో లీకైపోవడం అప్పట్లో కలకలం రేపింది. ఇక ఆన్ లొకేషన్ నుంచి ఫోటోలు వీడియోల లీకుల గురించి చెప్పాల్సిన పనే లేదు. అసలు సినిమా కథేంటో తెలియనీకుండా దాచాలన్న ప్రయత్నాలు చాలా సార్లు లీకుల వల్ల దాగలేదు. బాహుబలి ఫ్రాంఛైజీ మొదలు అగ్ర హీరోలు నటించిన ప్రతి సినిమాకి సంబంధించిన క్లిప్పింగులు చిత్రబృందం అధికారికంగా రిలీజ్ చేయకముందే బయటపడిపోతున్నాయి.
ఇటీవల `పుష్ప`ను ఈ బెడద వదల్లేదు. ఇంతకుముందు ఆన్ లొకేషన్ నుంచి ఫోటోలు క్లిప్పింగులు లీకైపోయాయి. తాజాగా దాక్కో దాక్కో మేక (మొదటి) సాంగ్ ని నేడు (శుక్రవారం) విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కానీ అంతకుముందే రఫ్ వెర్షన్ లీకైపోవడం కలకలం రేపింది. ఈ పాటను దేవీశ్రీ ఆలపించగా.. బన్ని లుక్ రఫ్ అండ్ ఠఫ్ గా కనిపించనుంది. చూస్తుంటే బన్ని ఫ్యాన్స్ నేటి సాయంత్రం వరకూ ఆగడం కష్టమే. పాట గురువారం సాయంత్రమే లీక్ అయిపోవడంతో అసలేమైందో అర్థం కాలేదు ఎవరికీ. డిజిటల్ లో లీకులివ్వడం సులువు. దీనిని ఎవరు విడుదల చేసారో కానీ విజువల్స్ అయితే లేవు. కానీ పాట రఫ్ గా వినిపిస్తోంది. చిత్రబృందం ఈ లీకులకు కారణమెవరో కనిపెట్టి ఇకపై అలా జరగకుండా నిలువరిస్తుందేమో చూడాలి.
లీకులపై డౌట్స్ ఉన్నాయంటూ..!
పుష్ప సాంగ్ లీక్ అయిందా లీక్ చేసారా...! వాస్తవానికి అభిమానుల్లో టూమచ్ అంచనాలతో ఎక్కువ ఆసక్తి ఉన్న సినిమా పబ్లిసిటీ కంటెంట్ ఇలా లీక్ అవ్వడం పరిపాటే. తాజాగా మహేశ్ బాబు సర్కారి వారి పాట టీజర్ కూడా ఇలానే రిలీజ్ టైమ్ కి ముందే లీక్ అయింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా పుష్ప పాట కూడా ఇదే విధంగా లీక్ అవ్వడం పై సోషల్ మీడియా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో చాలా మంది ఈ పాటను బన్నీ టీమ్ కావాలానే లీక్ చేశారని గుసగుసగా మాట్లాడుకోవడం వినిపిస్తోంది.
పుష్ప డ్యూయాలజీలో మొదటి భాగం దసరా కానుకగా లేదా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. దసరా కుదరకపోతే క్రిస్మస్ కి వెళుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయిక. బన్ని గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపిస్తారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.