• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప' సినిమాలో భాగం...

'పుష్ప' సినిమాలో భాగం కానున్న ఒకప్పటి లవర్ బాయ్..?

By - Tupaki Desk
Update: 2021-06-01 08:31 GMT
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ''పుష్ప''. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్ - అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్  తరుణ్ కూడా భాగం కాబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన తరుణ్.. 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. పాతికేళ్ల వయసులోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న తరుణ్.. లవర్ బాయ్ ఇమేజ్ ని సొతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 'నువ్వులేక నేను లేను' 'నువ్వే నువ్వే' 'ప్రియమైన నీకు' 'ఎలా చెప్పను' 'నీ మనసు నాకు తెలుసు' వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే కథల ఎంపికలో పొరపాట్లు చేయడంతో ఆ తర్వాత వరుస అపజయాలు అందుకున్నాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా లాభం లేకపోవడంతో సినిమాలను పక్కన పెట్టి బిజినెస్ పై దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో రీసెంటుగా నటుడిగా కాకుండా తన తల్లి బాటలో డబ్బింగ్ ఆర్టిస్టుగా సరికొత్త అవతారమెత్తాడు తరుణ్.

ఫహాద్ ఫాజిల్ - సాయి పల్లవి జంటగా నటించిన 'అనుకోని అతిథి' సినిమా ఇటీవలే ఆహా ఓటీటీలో విడుదలైంది. ఇందులో ఫహాద్ కు తరుణ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. మలయాళ నేచురల్ స్టార్ వాయిస్ కి సరిపోయేలా తరుణ్ డబ్బింగ్ చెప్పాడని అందరూ మెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు 'పుష్ప' లో విలన్ రోల్ లో నటిస్తున్న ఫహాద్ కు తరుణ్ చేతనే డబ్బింగ్ చెప్పించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. 'అనుకోని అతిథి' సినిమాలో పాత్రకు సెట్ అయినట్లు తన వాయిస్ విలన్ పాత్రకు సూట్ అవుతుందో లేదో చూడాలి. తరుణ్ 'పుష్ప' సినిమాలో భాగం కానున్నట్లు వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Tags:    
  • Allu Arjun 
  • Pushpa 
  • Tollywood 
  • Pushpa Movie Updates 
  • Telugu News 

Similar News

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

రాజ‌మౌళి ముందే తొడ‌లు గొడుతున్నారా?

2026-11-09 10:30 GMT

రాజమౌళి 'వారణాసి'.. ఆ తొమ్మిది రత్నాల కథేంటి!

2026-11-09 10:28 GMT

రాముడి పాత్రలో సల్మాన్ ఖాన్.. చివరికి అలాంటి అవమానం!

2026-11-09 10:26 GMT

Copyright @2026

Powered by Blink CMS