మళ్లీ యాక్షన్ మూడ్‌లోనే పుష్ప
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ అదుగో ఇదుగో అంటూ ఎట్టకేలకు ఇటీవలే ప్రారంభం అయ్యింది. షూటింగ్ ను మారేడుమిల్లి అడవుల్లో మొన్నటి వరకు చేశారు. మొదటి షెడ్యూల్ లో ఎక్కువ శాతం యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. అందుకోసం అంతర్జాతీయ స్థాయి స్టంట్స్ మాస్టర్స్ ను మరియు టెక్నీషియన్స్ ను తీసుకు వచ్చారు. దాదాపు రెండు వారాలు కొనసాగిన ఆ షెడ్యూల్ ను ముగించేసిన సుకుమార్ తాజాగా హైదరాబాద్ లో పునః ప్రారంభించాడు. సినిమా కోసం వేసిన భారీ సెట్టింగ్ లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్నారు.
ఈ షెడ్యూల్ లో కూడా హీరోయిన్ పాల్గొనడం లేదు. మొదటి వారం నుండి పది రోజుల పాటు యాక్షన్ సన్నివేశాలనే అల్లు అర్జున్ మరియు ఫైటర్స్ పై చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్ లుక్ ను కొన్ని సీన్స్ కోసం మార్చాల్సి ఉందట. అందుకే మాస్ లుక్.. రఫ్ లుక్ కు సంబంధించిన సీన్స్ మరియు యాక్షన్ సన్నివేశాలను మొదటగా పూర్తి చేయాలని సుకుమార్ ప్లాన్ చేశాడు. అందుకే మొదటి రెండు షెడ్యూల్స్ లో మెజార్టీ పార్ట్ యాక్షన్ సన్నివేశాలే చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తదుపరి షెడ్యూల్ లో రష్మిక మందన్నా పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.