పుష్ప ఫస్ట్‌ సాంగ్.. అనుకున్నదే అవుతోంది

Update: 2021-08-15 00:30 GMT
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా సినిమా సందడి మొదలు అయ్యింది. రెండు పార్ట్‌ లుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ ను క్రిస్మస్‌ సందర్బంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. పుష్ప పార్ట్‌ 1 కు సంబంధించిన మొదటి పాటను విడుదల చేశారు. రాక్ స్టార్‌ కమ్‌ సామ్రాట్‌ ఆఫ్‌ మ్యూజక్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్‌ లో రికార్డుల మోత మోగించింది. అనూహ్యంగా ఈ పాట మొదటి 24 గంటల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ మూవీ లిరికల్‌ సాంగ్స్ ఏవీ కూడా దక్కించుకోలేని వ్యూస్ ను పుష్ప దాక్కో దాక్కో మేక సాంగ్‌ దక్కించుకుంది.

మొదటి 24 గంటల్లో ఈ సినిమా ఏకంగా 9.4 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాలో ఏ సినిమా పాట కూడా ఇంతటి వ్యూస్ ను దక్కించుకోలేదు. ఇక ఈ పాట లైక్స్ విషయంలో కూడా రికార్డ్‌ నమోదు అయ్యింది. మొదటి 24 గంటల్లో 6.57 లక్షల లైక్స్ ను దక్కించుకుంది. టాలీవుడ్‌ లో ఇప్పటి వరకు ఏ సినిమా పాట కూడా ఈ స్థాయి లైక్స్‌ ను దక్కించుకోలేదు. పుష్ప కు ఉన్న బజ్ నేపథ్యంలో ఇంతటి భారీగా లైక్స్ మరియు వ్యూస్‌ వచ్చాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఐకానిక్ స్టార్‌ అల్లు అర్జున్‌ మాస్‌ లుక్ తో పాటు మాస్టర్ ఆఫ్‌ సినిమా సుకుమార్‌ టేకింగ్‌ చూపించిన విధానం కూడా అద్బుతంగా ఉండి సినిమా ను మరో లెవల్‌ కు తీసుకు వెళ్లాయి అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను వచ్చే నెలలో పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇక సెకండ్‌ పార్ట్‌ కు ముందు బన్నీ ఐకాన్‌ సినిమాను చేస్తాడని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ లో పుష్ప 2 షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది. సుకుమార్‌ బన్నీలు గత చిత్రాలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. కనుక ఈ సినిమా తప్పకుండా అదే స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఈ పాటకు వచ్చిన వ్యూస్ మరియు లైక్స్‌ ను బట్టి ఏ స్థాయిలో ఇంట్రెస్ట్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News