పుష్ప దీపావ‌ళి ట్రీట్ సంథింగ్ స్పైసీగా

Update: 2021-11-01 13:30 GMT
డిసెంబ‌ర్ 17 రిలీజ్ ల‌క్ష్యంగా పుష్ప చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి సుకుమార్ టీమ్ నిర్మాణానంత‌ర ప‌నుల్ని సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌చారంలో పుష్ప టీమ్ వేగం పెంచింది. ఒక‌టొక‌టిగా గ్లింప్స్ ని విడుద‌ల చేస్తూ  సినిమాపై హైప్ పంచేస్తోంది టీమ్. ఇటీవ‌ల విడుద‌లైన సామి సామి సాంగ్ ఆద్యంతం బ‌న్ని మాస్ లుక్ ఆక‌ట్టుకుంది. గ్రామీణ వాతావ‌ర‌ణంలో అంద‌మైన అడ‌విలో ఈ సినిమాని తెర‌కెక్కించ‌డంతో ఎంతో క్యూరియాసిటీని పెంచుతోంది. గ‌త కొద్దిరోజులుగా దీపావళి రోజున అభిమానులను సర్ ప్రైజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పుష్ప టీజర్ దీపావళి స్పెషల్ గా ఉంటుందని గుస‌గుస‌లు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఇంత‌వ‌ర‌కూ సుక్కూ టీమ్ అధికారికంగా దీనిపై ఏదీ ప్ర‌క‌టించ‌లేదు.

సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఆ ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని వేచి చూస్తున్నారు. గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్ గా బ‌న్ని అవ‌తారం అభిమానుల‌కు న‌చ్చింది. గుబురు గ‌డ్డం మాసిన త‌ల‌క‌ట్టుతో.. హాఫ్ గూని వాడిగా బ‌న్ని ఆహార్యం సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంటోంది. బ‌న్ని-ర‌ష్మిక మ‌ధ్య రొమాన్స్ ని పాట‌ల్లో ఎలివేట్ చేస్తున్నారు. ర‌ష్మిక లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న ద‌క్కుతోంది. త్వ‌ర‌లో రిలీజ‌య్యే టీజ‌ర్ లో అంత‌కుమించి చూపిస్తార‌ని భావిస్తున్నారు. టీజ‌ర్ లో కూడా బ‌న్నీని హైలైట్ చేయ‌నున్నార‌ని తెలిసింది. ఇప్పటికే అతని లుక్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. పుష్ప టీజర్ తో సుకుమార్ పుష్పరాజ్ ని ప్రేక్షకులకు మ‌రింత చేరువ చేస్తారు.

ఈ సినిమాని తెలుగు-త‌మిళం స‌హా హిందీ మార్కెట్లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేసేందుకు పుష్ప బృందం స‌న్నాహ‌కాల్లో ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే టీజ‌ర్ - ట్రైల‌ర్ పాన్ ఇండియా అప్పీల్ తో ఉండాల‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఆ ప్ర‌మాణాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండానే టీజ‌ర్ ని రెడీ చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పుష్ప‌కు సంబంధించిన ప‌నుల‌న్నిటినీ పూర్తి చేసి బ‌న్ని త‌దుప‌రి సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంటుంది. అత‌డు ఐకాన్ పైనా దృష్టి సారించార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఐకాన్ త‌ర్వాత పుష్ప 2 చిత్రీక‌ర‌ణ‌కు బ‌న్ని వెళ్లాల్సి ఉంటుంది.
Tags:    

Similar News