Pushpa 2: ఆ పని కూడా మొదలెట్టేస్తున్నారు

Update: 2023-03-17 09:28 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టి ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమాని పార్ట్ 1 కంటే గ్రాండియర్ గా హై రిచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం స్క్రిప్ట్ పైనే చాలా రోజుల నుంచి ఫోకస్ చేశారు. ఫైనల్ గా రెండు నెలల క్రితం షూటింగ్ స్టార్ట్ చేశారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉంది. ఈ సారి ఇండియన్ ఫారెస్ట్ లతో పాటు ఫారిన్ లోకేషన్స్ ని కూడా సుకుమార్ చూసినట్లు తెలుస్తుంది.

ఇక పుష్ప 2లో అల్లు అర్జున్ లుక్ ని రిచ్ గా డిజైన్ చేసినట్లు టాక్. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ డాన్ గా అల్లు అర్జున్ పాత్రని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం అతని కాస్ట్యూమ్స్, లుక్ అన్నింటా కూడా ప్రత్యేకంగా కనిపించే విధంగా శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఇక ఈ మూవీలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరో వైపు ఈ మూవీకి సంబందించిన మ్యూజిక్ వర్క్ ని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.

చెన్నైలో రికార్డింగ్ థియేటర్ లో మ్యూజిక్ సిట్టింగ్ జరిగినట్లు తెలుస్తుంది. ఇక దేవిశ్రీప్రసాద్, సుకుమార్ ఇద్దరు కూడా మ్యూజిక్ సిట్టింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇక త్వరలో అల్లు అర్జున్ కూడా వీరితో కాలుస్తాడని సమాచారం. పుష్ప సాంగ్స్ దేశ వ్యాప్తంగా ఇంత సెన్సేషన్ అయ్యాయి అనేది అందరికి తెలిసిందే. గత ఏడాది మొత్తం ఆ సాంగ్స్ సోషల్ మీడియాలో టాప్ మోస్ట్ ట్రెండింగ్ పాటలుగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఒక ఊపు ఊపెసాయని చెప్పాలి.

ఈ నేపధ్యంలో మొదటి సినిమాకి మించి సాంగ్స్ ఈ సారి ఉండే విధంగా దేవిశ్రీప్రసాద్ చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. సాంగ్స్ సినిమాకి అదనపు బలం అందిస్తాయని సుకుమార్ కూడా డిసైడ్ అయ్యి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 నుంచి ఫస్ట్ లుక్ టీజర్, లేదా గ్లిమ్ప్స్ ని అందించే ప్రయత్నం చేయడానికి సుకుమార్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News