బాహుబలితో పోల్చుకుంటే వాతలే

Update: 2015-08-03 23:29 GMT
బాహుబలి సృష్టించిన సంచలనాలు చూసి పొరుగు భాషల్లో కుళ్లుకుపోతున్నారనడానికి ఇదే నిదర్శనం. మీ వాళ్లు ఇన్నే సీజీ షాట్స్‌ ఉపయోగించారు. మావాళ్లు చూడండి లెక్కలేనన్ని సీజీ షాట్స్‌ ని చిత్రీకరించారు.. మీ కంటే ఒక ఆకు ఎక్కువే నమిలాం అన్న చందంగా గొప్పలు పోతున్నారు. ఇంతకీ విషయం ఏమంటే...

కోలీవుడ్‌లో విజయ్‌ హీరో గా చింబుదేవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పులి చిత్రం సీజీఐ పనులు సాగుతున్నాయిప్పుడు. సీజీఐ క్రియేటివ్‌ హెడ్‌ గా కమల్‌ కణ్ణన్‌ పనిచేస్తున్నారు. ఆయన బాహుబలితో పులి చిత్రాన్ని పోల్చి చెబుతూ ... బాహుబలి చిత్రం కోసం రాజమౌళి 2000 సీజీఐ సన్నివేశాల్ని ఉపయోగించారు. మేం అంతకంటే ఎక్కువే ఉపయోగిస్తున్నాం. పులి చిత్రంలో 2200 సీజీఐ సీన్స్‌ ఉంటాయి. అంతేకాదు బాహుబలిలో కొన్ని సీజీఐ షాట్స్‌ లో లోపాలు తెలిసిపోతున్నాయ్‌. అలాంటివి తెలియకుండా మేం ఎంతో శ్రమిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పారాయన.

అంతేనా మగధీరలో 1600 సన్నివేశాలు, ఈగలో 1200 సన్నివేశాలు సీజీఐలో తెరకెక్కించారని వివరించారు. ఇదంతా ఎందుకు చెప్పుతున్నా... బాహుబలిని డామినేట్‌ చేయాలనే ఆత్రంలో చేతులు కాల్చుకుంటున్నారన్న సంగతి అర్థమవుతోంది. అంతేకాదు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా అవసరం లేకపోయినా అదనపు సీజీఐ చేయడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదండోయ్‌ ... బాహుబలి రిలీజయ్యాక పరిణామాలు మారిపోయాయి. ఇకనుంచి సీజీఐ చేస్తే అది బాహుబలిని మించి ఉండాలి. లేదంటే పనవ్వదని పులి బృందం గ్రహించినట్టుంది..!!
Tags:    

Similar News