థర్టీ ఇయర్స్ పృథ్వీ.. భయపడుతున్నాడా?

Update: 2016-12-28 22:30 GMT
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో ఫేమస్ అయిన పృథ్వీకి.. లౌక్యం మూవీలో చేసిన బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్రతో రేంజ్ మారిపోయింది. అక్కడి నుంచి లీడ్ కమెడియన్ అయిపోయాడు. ఏకంగా హీరోగా చేసేయమంటూ ఆఫర్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఒకట్రెండు సినిమాల్లో హీరో పాత్ర చేసేందుకు అంగీకరించాడనే టాక్ ఉండగా.. ఇప్పుడు వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తుంది.

ధన్ రాజ్.. వెన్నెల కిషోర్.. శ్రీనివాస రెడ్డిలు హీరోలుగా అరంగేట్రం చేసి ఎదురుదెబ్బ తినేశారు. కమెడియన్ పాత్రలను వదలకపోవడం వీరికి కలిసొచ్చే విషయం. అయితే.. తాజాగా కమెడియన్ గా స్టార్ ఇమేజ్ సంపాదించుకుంటున్న సప్తగిరి కూడా సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ హీరో రోల్ చేసేశాడు. కలెక్షన్స్ బాగానే ఉన్నా.. పవన్ ఫ్యాక్టర్ కారణంగా డబ్బులు బాగానే వస్తున్నాయి. అయితే.. హీరోగా మాత్రం సప్తగిరిని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేదే ఇంకా తెలియని విషయం. ప్రస్తుతానికైతే బండి బాగానే లాగుతోంది.

ఇకపోతే తాజాగా మీలో ఎవరు కోటీశ్వరుడు మూవీలో కీలకమైన పాత్రతో హీరోలాంటి పాత్రకు ట్రయల్ వేశాడు పృథ్వీ. ఆ మూవీని కూడా జనాలు తిరక్కొట్టారు. ఆ రిజల్ట్.. అలాగే మిగిలిన కమెడియన్లు హీరోలుగా చేసిన సినిమాల రిజల్ట్ చూశాక.. తాను హీరో అవ్వాలనే ఆలోచన విరమించుకున్నాడట పృథ్వీ. మల్లన్న అనే మూవీ ఒకటి ప్రారంభం కావాల్సి ఉంది కానీ.. ఇప్పుడా  ప్రాజెక్ట్ డ్రాప్ అయినట్లే అంటున్నారు. స్టార్ కమెడియన్ గానే కంటిన్యూ కావడం తన కెరీర్ కి బెస్ట్ అని ఫిక్స్ అయ్యాడట పృథ్వీ.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News