ఎమ్మెస్ రాజుని మ‌రో వ‌ర్మ‌లా భావించొచ్చా!

Update: 2023-05-21 14:00 GMT
సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌ర్మ వ‌ర్కింగ్ స్టైల్...సెల‌క్ష‌న్ ఆఫ్ స్టొరీస్.. సెల‌క్ష‌న్ ఆఫ్ ఆర్టిస్ట్స్  ప్ర‌తీది డిఫ‌రెంట్. ఏం చేసినా కొత్త‌గా ట్రెండీగా ఉండాలంటాడు. అందులో  సంచ‌ల‌నం త‌ప్ప‌క ఉండేలా చూస్తారు. అందుకే ఆయ‌న సంచ‌ల‌నాల వ‌ర్మ అయ్యారు! అన్న‌ది ప‌చ్చి వాస్త‌వం.  ఇలాంటి వ‌ర్మ‌లా త‌యార‌వ్వాలని కొంత మంది మ‌న‌సులో బ‌ల‌మైన‌ కొరిక ఉన్నా! అంద‌రూ బ‌య‌ట పెట్ట‌లేరు. కొంద‌రు మాత్ర‌మే బ‌య‌ట పెట్ట‌గ‌ల్గుతారు.

వ‌ర్మ‌తో ఇంట‌రాక్ట్ అయ్యే స‌మ‌యంలో వ‌ర్మ‌తో స‌రితూగే ఆలోచన‌ల్ని కొంద‌రు పంచుకోవ‌డం చూసాం. మ‌రి వ‌ర్మ‌లాగే సంచ‌ల‌నం అవ్వాల‌ని టాలీవుడ్ లో మ‌రో డైరెక్ట‌ర్ కం నిర్మాత‌-రైట‌ర్ భావిస్తున్నారా? అత‌ని ఆలోచ‌న‌లు అలాగే ఉన్నాయా? అంటే అవున‌నే అనిపిస్తుంది. ఆయ‌న ఎమ్మెస్ రాజు. నిర్మాత గా..ర చ‌యిత‌గా ఎన్నో సినిమాల‌కు ప‌నిచేసిన ఆయ‌న ఈ మ‌ధ్య ద‌ర్శ‌క‌త్వం వైపు సీరియ‌స్ గానే ఉన్నారు.

`డ‌ర్టీ హ‌రి` ..`7 డేస్ 6 నైట్స్` లాంటి బోల్డ్ సినిమా చేసి పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యారు.  తాజాగా న‌రేష్-ప‌విత్ర జోడిగా మ‌ళ్లీ పెళ్లి అంటూ ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. న‌రేష్-ప‌విత్ర‌ల రిలేష‌న్ షిప్ ఎంత హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. స‌రిగ్గా అదే ఇష్యూని ఎన్ క్యాష్ చేసుకునేందుకు ఈ త్రయం న‌డుం బిగించింది. దీనిలో  భాగంగా ప్రాజెక్ట్ టేక‌ప్ చేయ‌డం..పూర్తి చేయ‌డం అంతా వేగంగానే జ‌రిగిపోయింది.  

ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా రాజుగారు  వ‌ర్మ త‌ర‌హాలోనే కొన్ని ఆస‌క్తిర విష‌యాలు పంచుకున్నారు. `కొత్త‌గా సినిమాలు చేయాలి అన్న త‌ప‌న‌తో ద‌ర్శ‌కుడిన‌య్యా. లేదంటే ఇంట్లోనే కూర్చునే వాడిని. నేనెప్పుడు ట్రెండీగా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తా. `డ‌ర్టీ హ‌రి` క‌థ రాసి సినిమా చేయ‌మ‌ని ఓ యంగ్ డైరెక్ట‌ర్ ని అడిగితే భ‌య‌ప‌డి చేయ‌ను అన్నాడు. యువ‌ న‌టులు కూడా ఇలాంటి సినిమాలు చేయాలంటే ఆలోచిస్తున్నారు.

యువకుల్ని కూడా భ‌య‌పెట్టే క‌థ‌లు చేయాల‌నుకుంటున్నా. మారుతున్న ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్టు నేను మారుతున్నా.  మార‌డానికి అస‌మ‌ర్దుల‌మైతే రిటైర్మెంట్ తీసుకుని మ‌న‌వ‌ళ్ల‌తో ఆడుకోవ‌డం మంచింది.  సంప్ర‌దాయేత‌ర సినిమాలు చేసి సంచ‌ల‌న‌మ‌వుతా`  అని అన్నారు.

Similar News