`డర్టీ హరి`తో సరికొత్త మార్గాన్ని అన్వేషించారట
పరిశ్రమలో ఎన్నో కళాత్మక చిత్రాల్ని నిర్మించిన అగ్ర నిర్మాతగా ఎం.ఎస్.రాజు గురించి పరిచయం అవసరం లేదు. దేవి- వర్షం- ఒక్కడు- మనసంతా నువ్వే -నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బాస్టర్స్ నిర్మించిన ఎం.ఎస్.రాజు దర్శకునిగా ఒక కొత్త పంథాలో వెళుతున్నారు. ఆయన తెరకెక్కించిన `డర్టీ పిక్చర్` ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎం.ఎస్.రాజు అంటే ఒక బ్రాండ్. ఆయన ఇలాంటి సినిమాలు కూడా చేస్తారా? అంటూ సోషల్ మీడియాల్లో రకరకాల వ్యాఖ్యానాలు వినిపించడంపై తనదైన శైలిలో స్పందించారు.
నిర్మాత ఎంఎస్ రాజు తన డర్టీ హరి చిత్రం గురించి ధైర్యంగా ఓ ప్రకటన చేశారు. సందర్భంగా దర్శకనిర్మాత ఎంఎస్ రాజు మాట్లాడుతూ “నేను కళా ప్రక్రియలలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలకు పనిచేశాను. కానీ `డర్టీ హరి` నన్ను సరికొత్త మార్గాన్ని అన్వేషించేలా చేసింది. M.S బ్రాండ్ ఎలా ఉంటుందో నేను సోషల్ మీడియాలో వ్యాఖ్యలను చూశాను. రాజు ఈ తరహా చిత్రానికి పని చేయగలరా? అన్నారు. కానీ ప్రస్తుతం దాని గురించి వ్యాఖ్యానించకూడదని భావిస్తున్నాను. నేను సినిమా ఎందుకు చేసాను? దేనికోసం చేశాను? అన్నది నాకు తెలుసు. ప్రేక్షకులకు అర్థం కానిది ఏమిటంటే.. డిసెంబర్ 18 న సినిమా చూసిన తరువాతే మాట్లాడాలి`` అని అన్నారు.
శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరో హీరోయిన్లు. ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి - వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 18 న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.