ప్ర‌మాదం నుంచి కాపాడీ పీసీకి స్నేహితురాలైంది

Update: 2020-11-24 08:10 GMT
హాలీవుడ్ సినిమాలు.. టీవీ సిరీస్ ల‌లో న‌టిస్తూ అక్క‌డే నిర్మాత‌గా సెటిల‌వుతోంది ప్రియాంక చోప్రా జోనాస్. అమెరికన్ సింగ‌ర్ కం న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి పాశ్చాత్య దేశాల్లో అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది. ఇక సాటి న‌టీన‌టులు.. ఫిలింమేక‌ర్స్ తోనూ పీసీ స్నేహం నిరంత‌రం హాట్ టాపిక్. త‌న‌దైన వ్య‌క్తిత్వంతో ప‌దిమందిలో మంచి అనిపించుకుంటున్న‌ పీసీ ఈ పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన శైలిలో రాణిస్తోందనే చెప్పాలి.

తాజాగా త‌న స్నేహితుడు కం న‌టుడికి త‌న పుట్టిన‌రోజున‌ పుట్టిన‌రోజు విషెస్ చెప్పిన పీసీ మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తి గా పాపుల‌రైంది. ప్రియాంక చోప్రా తన పుట్టినరోజున `క్వాంటికో` సహనటుడు యాస్మిన్ అల్ మాస్రీకి పుట్టినరోజు సందేశాన్ని ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. అక్కడ లెబనీస్ నటుడు త‌న‌ను ఓ ప్ర‌మాదం నుంచి కాపాడుతున్న వీడియో షాకిస్తోంది. త‌న‌ను గాయం భారిన ప‌డ‌కుండా కాపాడటం కనిపిస్తుంది. వీడియోలో ఎబిసి షో సెట్స్ ‌పై ప్రియాంక నడుచుకుంటూ వెళుతుంటే...ఒక కుర్చీ తన వైపు కదులుతున్నది గ‌మ‌నించ‌నే లేదు.  ఒక ర‌న్నింగ్ ట్రాలీపై సినిమాటోగ్రాఫర్ తన ప‌ని తాను చేసుకుంటూ డ్రైవ్ చేస్తుండ‌గా.. అది పీసీ వైపు దూసుకొచ్చింది.

ప్రియాంకాను కాపాడటానికి యాస్మిన్ సరైన సమయంలో రంగంలోకి దూక‌డం క‌నిపిస్తోంది. న్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన వీడియోలో సెట్ అంతా గందరగోళంలో ప‌డిన వైనం క‌నిపిస్తోంది. ప్రియాంక స‌డెన్ ఇన్సిడెంట్ కి ముఖంపై చేతులు వేసుకుని ఆశ్చ‌ర్య‌పోయింది. ఈ చిన్న వీడియోను పంచుకుంటూ, ప్రియాంక ఇలా అంది. “ఎల్లప్పుడూ నా వెన్నుముక గా ఉన్నందుకు ధన్యవాదాలు. # త్రోబ్యాక్ మీరు చాలా ప్రియమైనవారు.. అందంగా ఉన్నారు! ” అని పీసీ త‌న‌ను ప్ర‌మాదం నుంచి కాపాడిన‌ యాస్మిన్ ని ఉద్ధేశించి వ్యాఖ్యానించింది.

క్వాంటికో టీవీ సిరీస్ తోనే ప్రియాంక పశ్చిమ సినీప్ర‌పంచంలోకి ప్రవేశించింది. బాలీవుడ్ లో స్థిరపడిన ఈ స్టార్ .. మాజీ మిస్ వరల్డ్ గా అప్ప‌టికే ప్ర‌పంచానికి సుప‌రిచితం అయిన ఏబీసీ రియాలిటీ షో ద్వారా మ‌రింత పాపుల‌రైంది.

ప్రియాంక రోల్ ఇందులో ఆస‌క్తిక‌రం. అలెక్స్ పారిష్ ను ఎఫ్ ‌బిఐ రిక్రూట్ చేశాక ఏం జ‌రిగింది? అన్న స్టోరీలో పీసీ న‌ట‌న అద‌ర‌గొట్టింది.  జాషువా సఫ్రాన్ సృష్టించిన ఎబిసి షో 27 సెప్టెంబర్ 2015 న టెలీకాస్ట్ అయ్యింది. 3 ఆగష్టు 2018 తో ఇది ముగిసింది. ఈ ప్రదర్శనలో జేక్ మెక్ లాఫ్లిన్.. జోహన్నా బ్రాడి.. ఎల్లిస్ తదితరులు నటించారు. అభిమాన  టీవీ నటిగా 2016 - 2017 సంవత్సరాల్లో వ‌రుస‌గా రెండు పీపుల్స్ ఛాయిస్ అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రియాంక అప్పుడు బేవాచ్ వంటి ప్రాజెక్టులతో గ్లోబల్ ఐకాన్ గా పశ్చిమంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ప్రియాంక - యాస్మిన్ కూడా సన్నిహితులు అయ్యారు. వారు తరచూ పార్టీలు షికార్లకు వెల్ల‌డం తెలిసిన‌దే. యాస్మిన్ స్టార్ల వివాహ వేడుకల్లో సంద‌డి చేస్తుంటారు. ఆమెతో క‌లిసి పీసీ 2016 లో భారతదేశాన్ని సందర్శించింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఆమె యాస్మిన్ కుమారుడు లియామ్ ‌తో వీడియోలను రెగ్యుల‌ర్ గానే పంచుకుంటారు.
Tags:    

Similar News