ఫోటో స్టోరీ: స్విమ్ సూట్ లో శ్రీమతి సెగలు
సినిమా పరిశ్రమలో సాధారణంగా పెళ్లయిన హీరోయిన్లను చూసే దృక్పధం మారుతూ ఉంటుంది. వాళ్ళను గ్లామర్ వేషాల్లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరు. ఇది చాలా సార్లు చరిత్ర ఋజువు చేసిన సత్యం. టాలీవుడ్ లో ఈ ధోరణి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే సమంతా లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ సైతం పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో హిట్లు కొడుతోంది తప్ప గతంలోలా కించిత్ ఎక్స్ పోజింగ్ కూడా ఎస్ చెప్పడం లేదు.
కానీ బాలీవుడ్ భామలు దీనికి పూర్తి మినహాయింపుగా ఉంటారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా కరీనా కపూర్ వీర్ దే వెడ్డింగ్ లాంటి సినిమాలు చేయడం ఫోటో షూట్స్ లో బోల్డ్ గా కనిపించడం మానుకోలేదు. తానేం తక్కువ తిన్నానా అంటూ ఇప్పుడు ఈ వరసలో ప్రియాంకా చోప్రా కూడా జాయిన్ అయ్యింది. ఇటీవలే వెకేషన్ కోసం మియామి వెళ్లిన ప్రియాంకా అక్కడ స్విమ్ సూట్ లో ఇచ్చిన ఫోజులు నెటిజెన్ల మతులు పోగొడుతున్నాయి. ఈ భామకు నిజంగా నలభై ఏళ్ళు దగ్గర పడుతున్నాయా అని అనుమానం వచ్చేలా ఇస్తున్న స్టిల్స్ చూసి నోరెళ్లబెట్టడం ఒక్కటే తక్కువగా ఉంది.
నిక్ జోనాస్ తో పెళ్లితో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించిన ప్రియాంకా చోప్రా ఆ తరవాత కూడా హై లైట్ అవ్వడం మానలేదు. ఇప్పుడు పిసి ఫ్యాన్స్ ఈ ఫోటోలు చూసి ఆనందంతో మురిసిపోతుండగా సాంప్రదాయవాదులు మాత్రం పెళ్లయ్యాక ఇవేం వేషాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ తాను పట్టించుకునే టైపు కాదు కాబట్టి ఇంకొంత మసాలా స్టఫ్ ను తన నుంచి నిరభ్యంతరంగా ఆశించవచ్చు.